రామాయణం కథను సినిమాగా తెరకెక్కించబోతున్న అల్లు అరవింద్ అండ్ కో నిర్మాతలు.  ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం చేశారు.  త్వరలోనే అన్ని వివరాలను ప్రకటించబోతున్నారు.  ఇందులో రాముడు ఎవరు, మిగతా క్యాస్టింగ్ ఎవరు అన్నది త్వరలోనే తేలుతుంది.  


దీన్ని పక్కన పెడితే, రామాయణంలో రాముడు తరువాత ప్రధానంగా చెప్పుకునేది హనుమంతుడి గురించే.  హనుమంతుడు విజయానికి ప్రతిరూపం.  చేపట్టిన కార్యాన్ని పూర్తి చేయకుండా వెనక్కి అడుగువేయడు.  మహాబలశాలి.  అలాంటి హనుమంతుడి గురించి గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.  


మహావీర్ హనుమాన్ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.  ఎలాగో ఇప్పుడు పురాణాల కథలను సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి, హనుమాన్ చరిత్ర గురించిన ప్రత్యేకమైన సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుంది కదా.  


హనుమాన్ గురించి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు.  హనుమంతుడిని కొలిచే వ్యక్తులు కోకొల్లలు.  హనుమంతుని కథతో సినిమా తీస్తే అందులో ఎవరు హీరోగా ఉంటె బాగుంటుంది.  రామాయణం కథలో హనుమంతుడి పాత్ర ఉన్నది.  ఆ పాత్ర కోసం ఖచ్చితంగా ఒక స్టార్ హీరోను తీసుకుంటారు కాబట్టి ఆ హీరోతో సపరేట్ గా హనుమాన్ సినిమా తీస్తే బాగుంటుంది కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: