కమెడియన్‌ గా కెరియర్ మొదలుపెట్టి కొన్ని వందల సినిమాలలో నటించిన అలీ కొంతకాలం హీరోగా హిట్లు అందుకున్నాడు. అయితే ఆ తరువాత మారిన పరిస్థుతులలో అలీ హీరోగా కొనసాగలేనని తెలుసుకుని తిరిగి యూటర్న్ తీసుకుని కామెడీ రోల్స్ చేస్తూ మధ్యలో బుల్లితెర క్రార్యక్రమాలు కూడ చేసుకుంటున్నాడు. 

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో అలీ లేటెస్ట్ గా నటిస్తున్న ‘పండుగాడి ఫోటో స్టూడియో’ ట్రైలర్ చూసిన వారు చాలామంది ఆశ్చర్య పోతున్నారు. అలీ ఈసినిమాలో తాను ఒక పెద్ద మాస్ హీరోలా భావిస్తూ బౌన్సింగ్ ఫైట్లు చేయడం బిల్డప్ డైలాగులు కొడుతూ షాక్ ఇవ్వడం చూసిన వారు ఆశ్చర్య పోతూ అలీ చేస్తున్న ఈ విన్యాసాలు ఏమిటి అంటూ షాక్ అవుతున్నారు. 

ఇది చాలదు అన్నట్లుగా ఒక సీన్లో హీరోయిన్‌ ను కౌగిలించుకుని పొర్లిన తీరు చూస్తుంటే ఇది ఏమైనా బి గ్రేడ్ సినిమానా అని అనిపించడం ఖాయం. టాప్ యంగ్ హీరోలు అంతా మారిన ట్రెండ్ కు అనుగుణంగా సభ్యతతో కూడిన సన్నివేశాలలో నటిస్తుంటే అలీ ఇలాంటి సీన్స్ లో ఎందుకు నటిస్తున్నాడు అని అనిపించడం ఖాయం. 

ప్రస్తుతం అలీకి హీరోగా ఏమాత్రం క్రేజ్ లేని నేపధ్యంలో అతడి సినిమా విడుదల చేయడమే కష్టమయ్యే పరిస్థితులు ఇలాంటి వాస్తవాలను గ్రహించకుండా అలీ ఒకప్పటి ట్రెండ్ ను మళ్ళీ చూపెడుతూ ‘పండుగాడి ఫోటో స్టూడియో’ ద్వారా ప్రయత్నిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా అలీ ఎమ్.ఎల్.సి పదవిని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నేతలతో రాయబారాలు చేస్తున్నాడు అని వస్తున్న వార్తలను చూసి సినిమాల విషయంలో అదేవిధంగా రాజకీయాలలోని పదవుల విషయంలో అలీకి మితిమీరిన ఆశ పెరిగింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: