ఇప్పుడంటే అంటే గ్రాఫిక్స్ వచ్చింది.  రెండు కాదు నాలుగైదు పాత్రలను కూడా అవలీలగా తెరపై సృష్టించవచ్చు.  పెద్ద కష్టం ఏమి కాదు.  కానీ, బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అలా కుదరదు.  మన దగ్గర అంత టెక్నాలజీ లేదు.  కేవలం కెమెరా ట్రిక్, స్ప్లిట్  ద్వారానే రెండు పాత్రలను సృష్టించాలి.  


సురేష్ ప్రొడక్షన్స్ లో రామారావు రాముడు భీముడు సినిమా చేశారు.  అదే సురేష్ ప్రొడక్షన్స్ మొదటి సినిమా.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  ఇందులో రామారావు రెండు పాత్రలు చేశారు.  అప్పటికి రామారావు ఫుల్ బిజీ.  అయన కాల్ షీట్స్ దొరకాలంటే చాలా కష్టం. 


ఇచ్చిన కాల్ షీట్స్ లోనే సినిమా పూర్తి చేయాలి.  అంతా పూర్తయింది.  క్లైమాక్స్ లో ఓ సీన్ తీయాలి.  ఆ సీన్ లో రాముడు, భీముడు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉండాలి.  దీన్ని కెమెరా ట్రిక్ ద్వారా లేదంటే స్ప్లిట్ ద్వారా చేయాలి.  రామారావు మేకప్ వేసుకున్నారు.  


ఎలాగోలా కష్టపడి ఒక్క రోజు ఎక్స్ట్రా కాల్ షీట్ సంప్రదించారట.  ఆ ఒక్కరోజులో రెండు గెటప్ లతో షూట్ చేయడం కుదరదు.  అందుకే రామారావు తో పాటు డూప్ గా సత్యన్నారాయణ యాక్ట్ చేశారు.  మాస్క్ ధరించి, వేషం వేయాలి. ఎలాగోలా డూప్ ను లాంగ్ షాట్ లో కవర్ చేసి షూటింగ్ కానిచ్చేశారట.  సినిమా హిట్ కావడంతో ప్రేక్షకులు ఆ డూప్ ను సరిగా గుర్తు పెట్టలేదట.  రామారావే అనుకున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: