వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ అనుకున్న స్థాయిలో విజయవంతం అయితే విజయ్ నానీ స్థానాన్ని ఆక్రమించడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నాయి. దీనితో ఈ నెలలో విడుదల కాబోతున్న ‘డియర్ కామ్రేడ్’ వచ్చేనెల విడుదల కాబోతున్న ‘గ్యాంగ్ లీడర్’ ల ఫలితాలను బట్టి విజయ్ నానీల భవిష్యత్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో విజయ్ దేవరకొండ నానీకి సహాయపడుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘గ్యాంగ్ లీడర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ లను ఈనెల 25వ తారీఖు లోపున విడుదల చేసి ఈమూవీ ట్రైలర్ ను ఈనెల విడుదల అవుతున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీతో కలిసి ప్రేక్షకులకు చూపించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 

విజయ్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రావడమే కాకుండా యూత్ బాగా వస్తారు కాబట్టి ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ ను ‘డియర్ కామ్రేడ్’ తో కలిసి చూపిస్తే జనంలోకి చాల సులువుగా వెళ్ళవచ్చు అన్న వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘జెర్సీ’ విజయం తరువాత ఆ హిట్ ట్రాక్ ను కొనసాగించాలని ‘గ్యాంగ్ లీడర్’ మూవీ కోసం నాని చాల కష్టపడ్డాడు. 

ప్రస్తుత పరిస్థుతులలో సంవత్సరానికి మూడు సినిమాలు విడుదల చేసి తీరాలి అనే పట్టుదల పై ఉన్న నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీని చాల వేగంగా పూర్తి చేసాడు. దీనికితోడు దర్శకుడు విక్రమ్ కుమార్ క్రియేటివిటి కూడ కలిసి రావడంతో ఈమూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో నానీకి విజయ్ దేవరకొండ ఇస్తున్న సహకారంతో ఈమూవీ మ్యానియా మరింత పెరిగే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: