శ్రీదేవి తెలుగు వారి కీర్తిని అమాంతం అకాశానికి పెంచిన అద్భుతం. ఆమె దివి నుంచి భువికి దిగి వచ్చిన అప్సరస అని అభిమానులు మనస్పూర్తిగా  నమ్ముతారు. ఇక శ్రీదేవి అతిలోక సుందరి, ఓసారి ఈ లోకాన్ని చూసిపోవాలని ఇలకు దిగిన దేవ కన్య. ఇలా శ్ఱేదేవి గురించి ఎన్నో వర్ణనలు, మరెన్నో విశ్లేషణలు. మరి ఆ అందాల అద్భుతం ఒక్కసారిగా అద్రుశ్యమైంది. ఇప్పటికీ అది అభిమానులకు ఓ షాక్.


ఇదిలా ఉండగా, ప్రముఖ నటి శ్రీదేవి హత్యకు గురైందని కేరళకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాదికారి చెప్పడం సంచలనంగా ఉంది.కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీ రిషిరాజ్‌ సింగ్‌ ఓ దినపత్రికకు రాసిన ఆర్టికిల్ ఇస్తూ, శ్రీదేవి మరణంపై తన అబిప్రాయాలు చెప్పారు. శ్రీదేవి మరణంలో కుట్రకోణం దాగి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.


 ‘ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నప్పటికీ అడుగు లోతు ఉండే నీటితొట్టెలో పడి చనిపోవడం అసాధ్యం. ఎవరైనా శ్రీదేవి కాళ్లను గట్టిగా ఒత్తిపట్టి తలను నీటిలో ముంచి ఉంటారని.. అలా చేస్తే తప్ప ఆమె చనిపోయే అవకాశం లేదు’ అంటూ ఈ రంగంలో నిపుణుడైన తన స్నేహితుడు ఉమాదత్తన్‌ తనతో చెప్పినట్లు రిషిరాజ్‌ సింగ్‌ వివరించారు. కాగా ఈ వ్యాఖ్యలను శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఖండించారు.


కానీ శ్రీదేవి అలా ఎలా చనిపోయిందన్నది మాత్రం అభిమానులకే కాదు, అందరికీ ఓ సస్పెన్సే. ఆమె మరణం సహజం అని ఎవరూ గట్టిగా అనలేని పరిస్థితి. కానీ ఇపుడు ఆమె లేదు. ఆమెది సహజ మరణమా. కుట్ర కోణమా అన్నది ఎప్పటికీ తేలని వ్యవహారమే.


మరింత సమాచారం తెలుసుకోండి: