Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Aug 23, 2019 | Last Updated 12:05 am IST

Menu &Sections

Search

'దొరసాని' బాగుంది కాని.... ?

'దొరసాని' బాగుంది కాని.... ?
'దొరసాని' బాగుంది కాని.... ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 ఆనాటి మరోచరిత్ర నుంచి... సీతాకోకచిలుక మీదుగా, మొన్నటి సైరాట్‌ (మరాఠీ) వరకు ఎన్నోసార్లు అనేక రకాలుగా తెరకెక్కిన ప్రేమ కధే ఇది. కాకపోతే , దొరల కాలం నాటి తెలంగాణ భూస్వామ్య నేపథ్యం, ఎగిసిపడే నక్సలిజమ్‌ అంశం 'దొరసాని'కి కొత్త రంగులద్దింది. మిగతా సినిమాల మధ్య వినూత్నంగా అనిపించే బ్యాక్‌డ్రాప్‌ వుంది...

ఏడాది క్రితం న్యూస్‌ అయిన 'ప్రేమకథ' వుంది. తెలంగాణ సినిమా తెరపై ఒక కొత్త చైతన్యం 'దొరసాని'.  ఈ తరం కవిత్వంలో కొత్తగొంతుకలుగా మారిన, మెర్సీమార్గరేట్‌,తంగెళ్ళశ్రీదేవిరెడ్డి, సతీష్‌గంధం లాంటి వారి కవితలు వాడి వారికి, క్రెడిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌ కెవిఆర్‌ మహేంద్రగారి నిజాయితీకి సలామ్‌ చెప్పాల్సిందే !!

సమకాలీన తెలుగు సినీ రంగం పై సమగ్ర అవగాహన తో సమీక్షలు చేసే కొందరు 'దొరసాని' గురించి ఏమంటారంటే....
'' ముగింపు ప్రతి ప్రేక్షకుడికీ విద్యుద్ఘాతం. మరాఠీ సైరాట్‌ ను సవరించి హిందీ ధడక్‌ ను అటూ ఇటూ సర్ది తెలంగాణ పల్లెకు అతికించినట్టుందని ఆ రెండు సినిమాలు చూసిన వారికి అనిపిస్తే తప్పేం లేదు. ఎనభైవ దశకంలోని తెలంగాణ గ్రామంలో చక్కర్లు కొట్టి రావాలనుకుంటే అక్కడి అప్పటి దొరతనపు క్రౌర్యాన్ని పరువును కాపాడుకునే నకిలీ అభిజాత్యాలను చూడాలనుకుంటే,  తప్పక చూడాల్సిన సినిమా.'' అంటున్నారు ప్రసేన్‌ బెల్లంకొండ .

 '' గడీ కిటికీ.. దొరసాని ఎర్ర గుడ్డ.. ఎరుపు రంగు దస్తీ.. ఎర్ర జెండా.. ఎర్ర 'వై'లు.. ఇంకా నన్ను ఎన్కౌంటర్‌ చేస్తూనే ఉన్నాయి దొరసాని. ఇది మాత్రం బూటకపు ఎన్కౌంటర్‌ కాదు. ఏ స్వీట్‌ అండ్‌ హార్ట్టచింగ్‌.. ఎన్కౌంటర్‌. అందుకే నిన్ను ప్రేమిస్తున్నా దొరసాని. శ్యామ్‌ బెనగల్‌ 'అంకుర్‌'.. నర్సింగరావు 'దాసి'లా.. కేవీఆర్‌ మహేంద్రాస్‌ 'దొరసాని'నీ ఎప్పటికీ మర్చిపోలేం.
రాజు మనసును మదించి వదించి కదిలించి కరిగించి చూస్తే.. కలిగే.. ఆనందం, అభిమానం, అనురాగం, ఆప్యాయత, ఆవేదన, ఆర్థ్రత అన్నీ కలబోసి కవిత రాస్తే దాని భావం నీవ్వే కదా దొరసానీ. '' అని అంటున్నారు సీనియర్‌ జర్నలిస్టు నగేష్‌ బీరెడ్డి. ...

విజయ్‌ దేవరకొండ తమ్ముడు, రాజశేఖర్‌ కూతురు నటించారనేది ఈ సినిమా వైపు ప్రేక్షకులను నడిపించ వచ్చేమో కానీ, అసలు సినిమాలో ఏమి చూపించారనేదే జనాన్ని టిక్కెట్లుగా మారుస్తుంది.
ఫిల్మ్‌ మేకింగ్‌లోనే కాదు, మీడియా మైలేజ్‌కి హెల్ప్‌ అయ్యే లీడ్‌ తీసుకున్నందుకు దర్శకుడిని మెచ్చుకొని తీరాల్సిందే !!


telangana-life
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.