ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న పూరి జగన్నాథ్ ఇప్పుడు అతని సినిమా అంటే వామ్మో అనే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో టెంపర్ తో హిట్ అందుకున్న పూరి అప్పటి నుండి సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్టు పడట్లేదు. ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ తో పూరి మరోసారి బౌన్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. 


ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి డైరక్షన్ లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. రామ్ ఇదవరకు ఎప్పుడు చేయని ఊర మాస్ అటెంప్ట్ తో చేస్తున్న ఈ సినిమా పూరికి లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈసారి హిట్టు కోసం తన కసి మొత్తం పెట్టి చేసినట్టు ఉన్నాడు పూరి.


అయితే తన ప్రతి సినిమాకు ఈ సినిమాతో గట్టిగా కొట్టేస్తున్నా అంటూ పూరి చెప్పడం కామనే అలానే రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కూడా పూరి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే పూరి కాన్ఫిడెన్స్ కు తగినట్టుగానే సినిమా ఫలితం ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే జూలై 18 వరకు ఆగాల్సిందే.     


సినిమాలో ఇది ఉంది అది లేదు అన్నట్టుగా యాక్షన్, లవ్, ఫైట్స్ అన్నిటిని పెట్టాడు. ఏ క్లాస్ సెంటర్స్ చెప్పలేం కాని పక్కగా బి, సి సెంటర్స్ లో సినిమా తప్పకుండా టార్గెట్ రీచ్ అయ్యేలా ఉందని అంటున్నారు. మరి పూరి నిజంగా ఈసారి సక్సెస్ కొడితే ఆయన ఫ్యాన్స్ సంతోషిస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: