హాట్ యాంకర్ అనసూయ గతవారం అమెరికాలో జరిగిన తానా మహాసభల కోసం అతిధిగా అమెరికా వెళ్ళింది. ఆ వేడుకలలో చక్కగా నిండైన చీరలో కనిపించిన అనసూయ ఆ మహాసభలు పూర్తి కాగానే తిరిగి తన ఒరిజనల్ గెటప్ కు వచ్చేసింది. 

ప్రస్తుతం ఆమెరికాలోని వివిధ ప్రాంతాలు టూర్ చేస్తున్న అనసూయ అమెరికాలోని ఒక పండ్ల తోటలోకి వెళ్లి అక్కడ చెర్రీ పండ్లను కోసుకుంటూ కెమెరాకు పోజులు ఇచ్చింది. అయితే అనసూయ ఆతోటలో పొట్టి నిక్కరు వేసుకుని హడావిడి చేయడంతో ఇప్పుడు ఆ ఫోటో పై సెటైర్లు పడుతున్నాయి.

కొంతమంది అనసూయ డ్రెసింగ్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ‘హడావిడిలో ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా’ అంటూ చురకలు వేస్తున్నారు. మరికొందరు అయితే తానా మహాసభలలో కనిపించిన తెలుగుతనం ఏమైపోయింది అంటూ అనసూయను టార్గెట్ చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం అనసూయ తన భర్త భరద్వాజ్ కింద కూర్చుని ఉంటే అనసూయ కుర్చీలో కూర్చుని మసాజ్ చేస్తున్నప్పుడు వేసుకున్న డ్రెస్ పై కూడ చాల కామెంట్స్ వచ్చాయి. అయితే అనసూయ ఇలాంటి కామెంట్స్ ను ఎప్పుడు లెక్కచేయడు. తాను వేసుకునే డ్రెస్ గురించి తన భర్త అభ్యంతరాలు చెప్పనప్పుడు బయట వ్యక్తులకు ఎక్కడ కామెంట్స్ చేసే అధికారం ఉంది అంటూ ప్రశ్నిస్తుంది. అయితే ఆమె అభిమానులు మాత్రం ఆమెను వదలకుండా ఇలా ద్వందార్ధాలతో సెటైర్లు వేయడం కొనసాగిస్తూనే ఉన్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: