డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ అంచనాలు నెలకొంటున్నాయి.  ఈ మూవీ హిట్ అయితే అటు నిర్మాతగా ఛార్మీ, దర్శకుడిగా పూరి, హీరోగా రామ్ ముగ్గురి కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంది.  ఎందుకంటే ఈ మూగ్గురు కొంత కాలంగా దరుణమైన అపజయాలు పొందుతున్నారు.  టెంపర్ మూవీ తర్వాత పూరికి ఒక్క హిట్ లేదు. 

నిర్మాతగా ఎంట్రి ఇచ్చినందుకు మెహబూబా తో దారుణమైన ఫలితం పొందింది ఛార్మీ...ఇక రామ్ విషయానికి వస్తే నేనుశైలజ తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు.  ఈ ముగ్గురు ఎంతో కసిలో ఇస్మార్ట్ శంకర్ మూవీ తెరకెక్కించినట్లు ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున ఈ విషయం మైకులు గుద్ది మరీ చెప్పారు.  ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన  నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.   

ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇటు నిధి అగర్వాల్ అటు నభా నటేశ్ కాంబినేషన్లోని రామ్ రొమాంటిక్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ మూవీలో రామ్ ఎన్నడూ కనిపించని మాస్ లుక్ తో డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నాడు. 

డైలాగ్స్ కూడా పక్కా తెలంగాణ మాస్ కుర్రోడు ఎలా పలుకుతాడు అలా ఉన్నాయి. మాస్ ఆడియన్స్ ను అలరించాలనే ఉద్దేశంతో, వాళ్లను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేశారు. చాక్లెట్ బాయ్ గానే ఎక్కువ మార్కులు కొట్టేసిన రామ్, మాస్ హీరోగా ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: