నాచురల్ స్టార్ నానీ హీరోగా, విక్రమ్ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నానీ ఫ్యాన్స్ తో పాటు, ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నానీ స్టోరీ సెలక్షన్ పై, విక్రమ్ కుమార్ డైరక్షన్ తోడవడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా అప్ డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ప్రీలుక్ పోస్టర్ తో తమ పబ్లిసిటీ ప్రారంభించారు.

 

నానీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ “మేం కలుసుకున్నాం, మేం రెడీ, మేమంతా ఓ గ్యాంగ్, నేనే ఈ గ్యాంగ్ లీడర్” అని రాసుకున్నాడు. సక్సెస్ ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ రాక్ స్టార్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పోస్టర్ లో ఐదుగురు మహిళల చేతులు నాని చేతితో కలిపినట్టుగా తామంతా ఒక గ్యాంగ్ అని అర్ధమయ్యేట్టు పోస్టర్ ను డిజైన్ చేసారు. దీంతో పాటు నిర్మాతలు సినిమా అప్ డేట్ ను కూడా రివీల్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూలై 15న, సాంగ్ ను జూలై 18న, టీజర్ ను జూలై 24న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

 

దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా “అందరూ గ్యాంగ్ లీడర్ సినిమా ప్రీలుక్ కోసం మాతో మీ చేతులు కలపండి” అని ట్వీట్ చేశాడు. ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. సినిమాలో లక్ష్మీ, ప్రియదర్శి, శరణ్య, రఘుబాబు, వెన్నెల కిశోర్, అనీశ్ కురువిల్లా ఇతర ముఖ్య తారాగణం. గ్యాంగ్ లీడర్ సినిమాను ఆగష్టు 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు.




మరింత సమాచారం తెలుసుకోండి: