మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం `సైరా`షూటింగ్ కంప్లీట్ చేసుకుని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సినిమా తర్వాత చిరు 152వ సినిమాకు వరుస హిట్లతో టాప్ గేర్‌లో ఉన్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ- చిరంజీవి కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను సంప్రదించారు. బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ తిరుగులేని తారగా ఎదిగింది.
ఐశ్వర్య బాలీవుడ్ లో బిజీ అయిన తర్వాత కూడా, ఐశ్వర్య తమిళ సినిమాలలో మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా నటిస్తూ వచ్చింది. కానీ తెలుగు చిత్రాల వైపు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు. నిజానికి ఆమె రెమ్యూనరేషన్ ఇక్కడి స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఉండటం ఒకటైతే... అసలు ఆమె తెలుగు సినిమాలలో నటిచడానికి అంత ఆసక్తిచూపించకపోవడం కూడా ఉంది. తాజాగా చిరు సినిమాలో నటించడానికి ఆమె భారీ రెమ్యూనరేషన్ అడిగినట్టు తెలిసింది.
అయితే ఇంతటి స్టార్ హీరో సినిమాలో నటించేందుకు రెమ్యూనరేషన్ విషయంలో పట్టు పట్టడంతో చిరంజీవికి ఘోర అవమానంగానే కనిపిస్తోంది. ఎప్పుడు మన దర్శకులు, నిర్మాతలు ఆమెను సంప్రదించినా వివిధ కారణాలతో ఆమె తిరస్కరించడం జరిగేది. ఆమె తీరుతో విసిగిపోయిన మన నిర్మాతలు ఆమెను సంప్రదించడమే మానేశారు. అయితే ఐశ్వర్య తీరును చూస్తున్న ఆమె ఫామ్ కోల్పోయాక కూడా ఇంత టెక్కు అవసరమా అని అనుకుంటున్నారు. దీంతో ఈ చిత్రానికి ఐశ్వర్యను తీసుకోవాలనే ఆలోచనను విరమించుకొనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలిసింది.