ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు చేసినా.. బాహుబలి రిలీజ్ అయ్యే వరకు ప్రభాస్ అంటే తెలుగు సినిమా హీరో అంతే.  బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది.  నేషనల్ హీరో అయ్యాడు.  ఈ హీరో ఇప్పుడు సాహో సినిమా చేస్తున్నాడు.  


ప్రభాస్ సాహో సినిమా కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.  యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఆగష్టు 15 వ తేదీన మూవీ రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.  


తెలుగు ప్రేక్షకులకు ఈ సాంగ్ పెద్దగా కిక్ ఇవ్వలేదు.  పార్టీ సాంగ్ కావడం పైగా తెలుగు పదాల కంటే ఇంగ్లీష్.. హిందీ పదాలు ఎక్కువగా వాడటంతో ఇది తెలుగు పాట కాదా అనే డౌట్ క్రియేట్ అయ్యింది.  ఇదిలా ఉంటె, ఇప్పుడు ప్రభాస్ సాహు ఫీవర్ భారత దేశం దాటి పాక్ లోకి ప్రవేశించింది.  


ప్రభాస్ సాహో సాంగ్ పై పాక్ నటి మవ్రా హికెన్ ప్రశంసలు కురిపించింది.  ప్రభాస్ సాంగ్ సైకో సయాన్ పేరును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.  ఇప్పుడు ఈ ట్వీట్ పాక్ తో పాటు ఇండియాలోనూ వైరల్ గా మారింది.   ఇండియాలో ఈ మూవీ ఆగష్టు 15 న రిలీజ్ అవుతున్నది. 

ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగానే అంటే ఆగష్టు 14 న రిలీజ్ అవుతుంది. పాకిస్తాన్ కూడా ఓవర్సీస్ కాబట్టి బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాను పాక్ లో ఆగష్టు 14 న రిలీజ్ చేస్తారా లేకుంటే 15 న రిలీజ్ చేస్తారా.  ఆగష్టు 14 న రిలీజ్ చేస్తే బాగుంటుంది.  ఎందుకంటే ఆరోజు పాకిస్తాన్ కు స్వతంత్రం వచ్చిన రోజు కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: