తెలుగు సినిమాలకు ఐటెం సాంగ్స్ కొత్తకాదు.  బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఐటెం సాంగ్స్ వస్తూనే ఉన్నాయి.  ఇప్పుడంటే సాంగ్స్ లో స్పైసి కనిపించదు కేవలం సాంగ్ లో డ్యాన్స్ చేసే వాళ్ళను మాత్రమే హాట్ గా చూపిస్తుంటారు.  కానీ, పూర్వ కాలంలో సాంగ్ ఎంత స్పైసిగా ఉంటుందో అందులో డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా అంతే స్పైసిగా కనిపిస్తారు.  


మాములు కమర్షియల్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉంటాయంటే సరే అనుకోవచ్చు.  కానీ, బాహుబలి వంటి మైథలాజికల్ సినిమాల్లో కూడా ఐటెం సాంగ్ ను పెట్టి శభాష్ అనిపించుకున్నాడు రాజమౌళి.  బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ ఉన్నది కదా.  అందులో డ్యాన్స్ చేసిన అమ్మాయి విదేశీ వనితా.  ఆమె నోరా ఫతేహ్.  డ్యాన్స్ లో పిహెచ్.డి చేసింది.  


డ్యాన్స్ కోసం శరీరాన్ని ఎన్ని వంకలు తిప్పమంటే అన్ని వంకలు తిప్పుతుంది.  ఫిట్నెస్ అంటే అది అలా ఉండాలి.  ఇప్పుడు ఈ  బ్యూటీ బాలీవుడ్ లో బట్లా సినిమాలో సఖి సాఖియా సాంగ్ లో బెల్లి డ్యాన్స్ చేసింది.  బెల్లి డ్యాన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసిన నోరా.. మంటలతో చేసిన బెల్లి డ్యాన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.  


జాన్ అబ్రహాం హీరోగా చేస్తున్న ఈ మూవీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది.  సీరియస్ గా సాగే ఈ కథలో ప్రేక్షకులను కాస్తంత తుళ్లింత పడేలా చేసేందుకు ఈ సాంగ్ ఎంతగానో ఉపయోగపడుతుందట.  మరి సినిమాలో ఈ సాంగ్ ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: