టాలీవుడ్ ప్రస్తుతం అక్కినేని కోడ‌లు సమంత చుట్టూనే తిరుగుతుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్న సమంత వరుస విజయాలు అందుకుంటోంది. అక్కినేని వారసుడు నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక ఆమె దశ తిరిగిపోయింది. భర్తతో కలిసి నటించిన మ‌జిలీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆమె తాజాగా చేసిన ఓ బేబీ ఘన విజయం సాధించడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.


ఇప్పుడు ఆమెకు వ‌రుస పెట్టి ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. శర్వానంద్ హీరోగా తమిళ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ తో పాటు మామ నాగార్జున న‌టిస్తోన్న మ‌న్మ‌థుడు 2 సినిమాలో గెస్ట్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ రెండు త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉన్నా సమంత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నిర్మించే వెబ్ సిరీస్ లో నటించనుందని సమాచారం. ఈ మేరకు కథ చర్చలు కూడా నడుస్తున్నాయ‌ట‌.


ఇప్పటికే బాలీవుడ్ లో రాధిక ఆప్టే - కైరా అద్వానీ లాంటి టాప్ హీరోయిన్లు వెబ్ సీరీస్‌ల‌లో నటిస్తున్నారు. ఇక తెలుగులో శ్రద్ధాదాస్ లాంటి చిన్న హీరోయిన్లు కూడా కనిపించారు. ఇంత వరకు బాగానే ఉన్నా సమంత ప్రస్తుతం నటించే వెబ్ సిరీస్ లో ఆమె క్యారెక్టర్ చాలా బోల్డ్ గా ఉంటుందట. వెబ్‌కు సెన్సార్  ఆంక్ష‌లు లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా పెట్టేస్తుంటారు. మసాలా బాగా అద్దుతారు.


ప్ర‌స్తుతం సమంత నటించే వెబ్ సీరిస్‌ కూడా అలాంటి కోవలో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు సమంత అలాంటి క్యారెక్టర్లో నటిస్తే అక్కినేని ఫ్యాన్స్ ఖ‌చ్చితంగా హ‌ర్ట్‌ అవుతారు. చైతు కూడా వాళ్ల‌కు టార్గెట్ అవుతాడు. అక్కినేని కోడ‌లిగా ఆమె చైతు ప‌రువు తీయ‌కుండా ఉండాలంటే మంచి క‌థాంశం ఉన్న వెబ్ సీరిస్‌ల్లో న‌టిస్తే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: