'డియర్‌ కామ్రేడ్‌' సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన థియోట్రికల్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండే కాదు ఇండస్ట్రీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. మళ్లీ 'అర్జున్‌రెడ్డి' మోడ్‌లో విజయ్‌ దేవరకొండ 'యాంగ్రీ యంగ్‌మ్యాన్‌'గా బాగున్నాడనే టాక్ బాగా వినిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ, రష్మికల మధ్య ఉన్న కెమిస్ట్రీ ని ఈ ట్రైలర్‌లో బాగా హైలైట్‌గా చేశారు. ఎలాగైనా యూత్ ని బాగా అట్రాక్ట్ చేయాలని గట్టిగా ప్రయత్నించారని అర్థమవుతోంది. అందుకే డియర్‌ కామ్రేడ్‌ మంచి ఓపెనింగ్స్‌ సాధించడం ఖాయమని పరిశ్రమలో ఇప్పటికే టాక్ మొదలైపోయింది.
 
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ మాత్రమే కాకుండా క్రియేటివ్‌ విషయాలలో కూడా విజయ్‌ దేవరకొండ బాగా ఇన్‌వాల్వ్‌ అయినట్టు సమాచారం. ముందుగా ఫిక్స్‌ చేసుకుని తీసిన క్లయిమాక్స్‌ కూడా మళ్లీ రీషూట్‌ చేయించాడని గాసిప్స్‌ వున్నాయి. ఎమోషనల్‌ క్లయిమాక్స్‌ని, ట్రాజిక్‌ ఎండింగ్‌ని ముందుగా దర్శకుడు భరత్‌ కమ్మ ఫైనలైజ్‌ చేస్తే, అది బెడిసికొట్టే అవకాశముందని మార్చేసారట. ఇది నిజమో కాదో కానీ ఈ సినిమా రీ షూట్ మాత్రం జరిగిన మాట వాస్తవం.

ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో యూత్‌ఫుల్‌గా సాగినా, సెకండ్ హాఫ్ కాస్త హెవీ ఎమోషన్స్‌తో సాగుతుందని లేటెస్ట్ అప్‌డేట్. రష్మిక చాలా ఎమోషనల్‌ పాత్ర పోషించిందట. సెకండ్‌ హాఫ్‌ ఎంతగా కనక్ట్‌ అయితే డియర్‌ కామ్రేడ్‌ అంతగా మెప్పిస్తుందని చెప్పుకుంటున్నారట చాలా మంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: