టాలీవుడ్ లో వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా చాలా మంది తలరాతలను మార్చనుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్.... ఇటీవల హిట్ లేని యంగ్ హీరో రామ్.... నిర్మాతగా సరైన సక్సెస్ లేని ఛార్మి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల తో సహా చాలామంది ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఇస్మార్ట్‌ శంకర్ హిట్ అయితే వీళ్లంద‌రి కెరీర్‌కు మళ్లీ కొత్త ఊపిరి ఊదిన‌ట్టే అవుతుంది.


ఇప్పటికే రెండు ట్రైలర్లు రిలీజ్ అయ్యాయి. రెండు ట్రైల‌ర్ల‌లోనూ లౌడ్  బాగా ఎక్కువగా ఉందని... యాక్షన్ కాస్త ఓవర్ గా ఉందన్న కామెంట్లు పడ్డాయి. సినిమా ఎన‌లిస్టులు అయితే ట్రైలర్ వ‌ర‌స్ట్ అని... పూరి ఖాతాలో మరో డిజాస్ట‌ర్‌ ఖాయమని తిట్టిపోశారు. ఫ‌స్ట్ ట్రైల‌ర్‌కు బిజినెస్ వ‌ర్గాల్లో ఆస‌క్తి లేక‌పోవ‌డంతో పూరి రెండో ట్రైల‌ర్ వ‌దిలాడు. రెండో ట్రైలర్‌లోనూ అన్ని బూతులు... పూరి మార్క్ అసభ్యకర సన్నివేశాలు తప్ప సినిమా కొత్తగా ఉంటుందని ఆశ అయితే ఎవరికీ లేదు.


చివ‌ర‌కు రెండో ట్రైల‌ర్ త‌ర్వాత థియేట్రిక‌ల్ రైట్స్ మంచి రేటుకే వెళ్లాయంటున్నారు. ఈ చిత్రానికి బి, సి సెంటర్లలో జనం బారులు తీరిపోతారని బిజినెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇస్మార్ట్‌కు పద్ధెనిమిది కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. నాన్‌ థియేట్రికల్‌ ఇంచుమించు అంతే వుంటుందట. ముప్పయ్‌ అయిదు కోట్లు వచ్చాయి. రామ్‌ రెమ్యూనరేషన్‌ లేకుండా ఈ చిత్రాన్ని పదిహేను కోట్లలో తీసేసిన పూరి జగన్నాథ్‌కి ఎలా చూసినా పదిహేను కోట్లు మిగులుతుంద‌ని అంచ‌నా.. ఇక నిర్మాత‌గా కూడా చార్మీ చెత్త ట్రైల‌ర్ల‌తో గ‌ట్టిగానే వెన‌కేసుకుంద‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: