ఎంత గొప్ప సినిమా అయినా ఎంత పెద్ద సినిమా అయినా మరో పెద్ద సినిమా తోడు వుండాల్సిందే. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్దం అవుతోంది. అయితే ఇప్పటి నుంచే ప్రమోషనల్స్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రీలుక్, ఫస్ట్ లుక్, టీజర్ ఈ మూడూ ఈ నెల 25లోగానే వచ్చేస్తున్నాయని లేటెస్ట్ న్యూస్. అందుకు ఓ బలమైన కారణం ఉంది.

అదేంటంటే ఈనెల 25న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా విడుదల అవుతోంది. గ్యాంగ్ లీడర్ టీజర్ కనుక విజయ్ సినిమాతో థియేటర్లకు పంపిస్తే, మాంచి క్రేజ్ వస్తుందని నిర్మాతలు, హీరో కలిసి ఈ విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. రెండు సినిమాలకు నిర్మాతలు మైత్రీ మూవీస్ నే. ఏమయినా విజయ్ సినిమాకు వుండే క్రేజ్ వేరు. అలాంటి సినిమాతో నాని సినిమా టీజర్ జనాల్లోకి పంపిస్తే, ఫాస్ట్ గా దూసుకుపోయే అవకాశం వుంది. అందుకే ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. 

అందుకే ఈ నెల 13న ప్రారంభించి 25లోగా ప్రీలుక్, ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత సింగిల్ సాంగ్స్ రిలీజ్ చేయడం ప్రారంభించి వచ్చేనెల 15 కల్ల ఫినిష్ చేస్తారట. వీలయితే సాహోతో పాటు ట్రైలర్ ను థియేటర్లలోకి పంపిస్తారట. విక్రమ్ కే కుమార్ డైరక్షన్లో నాని చేస్తున్న నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాకు నాని మార్కెట్ ను మించి ఖర్చు చేసినట్లు మరో న్యూస్. అందుకే ఇప్పటి నుంచి ప్లాన్డ్ గా పబ్లిసిటీని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: