ఇస్మార్ట్ శంకర్ సినిమా బిజినెస్ క్లోజ్ అయిందని లేటెస్ట్ న్యూస్. రెండు ట్రయిలర్లు, టీజర్, సాంగ్స్ వగైరా పబ్లిసిటీ మెటీరియల్ బాగానే వర్కవుట్ అయిందని తెలుస్తోంది. దిల్ రాజు వెనక్కు తగ్గినప్పటికి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల మొత్తంమీద నలుగురు బయ్యర్లకు కొన్నట్టు ఫ్రెష్ అప్‌డేట్. సీడెడ్ హక్కులను ఫైనాన్సియల్ లావా దేవీల్లో భాగంగా శోభన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. నైజాం హక్కులను వరంగల్ కు చెందిన బయ్యర్ కు ఇచ్చారట. ఆరుకోట్లకు పైగా అని యూనిట్ వర్గాల సమాచారం. అయితే ఈ రేటు మీద భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. 

అంతేకాదు ఈ విషయంలో క్లారిటీ కూడా కాస్త తక్కువగా వుంది. ఆంధ్ర ఏరియాను ఆరుకోట్ల రేషియోలో ఇచ్చారని అంటున్నారు. గుంటూరు, వెస్ట్ మినహా మిగిలిన ఏరియాలు అన్నీ అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా తీసుకున్నారు. ఆ విధంగా మొత్తం బిజినెస్ క్లోజ్ అయిందని ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం. ఓవర్ సీస్ ను గ్రేట్ ఇండియా ఫిలింస్ కు పంపిణీకి ఇచ్చారట. 
ఇప్పటికే నాన్ థియేటర్ రైట్స్ మీద మంచి రిటన్సే వచ్చింది నిర్మాత చార్మికి.  మొత్తం మీద అన్నీకలిపి సినిమాకు అద్భుతంగా కాకపోయినా, టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ఇన్‌సైడ్ టాక్.

అంతేకాదు ఈ మధ్య కాలంలో పూరి డైరక్షన్ లో మాత్రం బాగా క్రేజ్ వచ్చిన సినిమా ఇదే. ఈ సినిమాకు ప్రచారం విషయంలో తీసుకున్న జాగ్రత్తలు బాగానే ఫలించాయని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక ఈ సినిమా వచ్చేవారం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మీదే దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్స్..ఇలా అందరి ఫ్యూచర్ ఆధారపడి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: