విక్రమ్ చియాన్ కధానాయకుడిగా రాజేష్ ఎన్ సెల్వ దర్శకత్వంలో హీరో కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్ కే.కే'. వాస్తవానికి ఈ చిత్రానికి తమిళంలో క‌ద‌ర‌మ్ కొండ‌న్ అనే టైటిల్. కమల్ హాసన్ సొంత బ్యానరైన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేత ఆర్ రవీంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు.

పూర్తి యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 19వ తేదీన విడుదల చెయ్యనున్నారు. ఇప్పిటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల మనసులో భారి అంచనాలు పెంచింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ కూడా నటిస్తుంది.   


టిక్ టాక్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ట్విట్టర్ లో ఓ ప్రేమోషన్ పోస్ట్ విడుదల చేసింది మిస్టర్ కే.కే టీం. అదేంటంటే 'మిస్టర్ కే.కే ట్రైలర్ ఉపయోగించుకొని వాటిలో డైలాగ్స్ ను టిక్ టాక్ చేసి #MisterKK, #MisterKKonJuly19 అనే హ్యాష్ ట్యాగ్స్ తో జత చెయ్యాలని, అందులో బెస్ట్ పరఫార్మెర్ కు చియాన్ విక్రమ్ ను కలుసుకునే అవకాశం ఇస్తాం అని తెలిపింది' ఇంకేంటి చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ టిక్ టాక్ చేసి అదరగొట్టండి, విక్రమ్ ను కలుసుకోండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: