బిగ్ బాస్ షో! టీవీ రంగంలో సంచలనాలకు వేదిక అయిన ఈషో.. మొదట్లోనే బాగానే అలరించినా.. తాజాగా ఈ షో పై వస్తున్న ఆరోపణలు మాత్రం అంతకన్నాఎక్కువగా సంచలనాలను సృష్ఠిస్తున్నాయి. రీసెంట్‌గా సీనియర్ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షో పై సంచలనమైన విమర్శలు చేశారు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. మూడో సీజన్ కు రెడీ అవుతోంది. అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేసేవారి ఎంపికలు జరుగుతున్న క్రమంలో చోటు చేసుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ యాంకర్- జర్నలిస్ట్.. శ్వేతారెడ్డి మీడియా ముందుకు వచ్చారు.  
 
తనకు ఈ షోలో ఆఫర్ వచ్చిందని అయితే నువ్వు బిగ్ బాస్ ను ఎలా ఇంప్రెస్ చేస్తావంటూ.. ప్రశ్నించారని క్యాస్టింగ్ కౌచ్ కు ఇది పక్కా నిదర్శనమని బ్రోతల్ హౌస్ నడుపుతున్నారని తనకు విషయం తెలిసి బయటకు వచ్చానని దీనిపై మహిళా సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇది జరిగి కనీసం 24 గంటలు కాకముందే.. ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగు చూసింది. ఏకంగా బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిన నటి ఫిదా ఫేం..గాయత్రి గుప్తా కూడా తన అనుభవాలను సోషల్ మీడియలో పంచుకుని విమర్షించారు. తనకు బిగ్ బాస్-2లో ఆఫర్ వస్తే ఇంటర్వ్యూకు వెళ్లానని చెప్పింది. ఇక్కడిదాకా బాగానే ఉంది. అయితే తనను నేరుగా అక్కడి వారు వంద రోజులు సెక్స్ కు దూరంగా ఉండగలవా?  వంద రోజుల పాటు సెక్స్ ను ఎలా మేనేజ్ చేస్తావంటూ ప్రశ్నించారని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. దీంతో తాను ఈ షోలో పార్టిసిపేట్ చేయలేదట. 

అంతేకాదు 'బిగ్ బాస్' ఆఫర్ క్యాన్సిల్ అయిన తర్వాత హౌస్ లోకి వెళ్లిన నా ఫ్రెండ్స్ ను హౌస్ లో ఎలా ఉంటుంది..? లోపల ఏం జరుగుతుంది..? అని అడిగాను. వాళ్లంతా.. క్యాన్సిల్ అయిందే మంచిదైంది అన్నారు. అక్కడ ఏం జరిగిందో అది ప్రసారం చేయరని.. వాళ్లు ఏం చూపించాలనుకుంటున్నారో అదే ప్లే చేస్తారు. నువ్వు ఎలా ఉన్నావో అది బయటకు వస్తుందన్న గ్యారెంటీ లేదు'' అని చెప్పారని గుప్తా వివరించింది. ఇప్పుడు ఈ పరిణామాలు బిగ్ బాస్ షోపై మరిన్ని సందేహాలకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియటం లేదని కొందరు చెప్పుకుంటున్నారు. అంతేకాదు బిగ్ బాస్-2 వచ్చి ఇన్ని రోజులైనా ఇప్పుడే ఈ విషయం ఎందుకు మాట్లాడింది గాయత్రి అని కూడా అనుమానాలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: