ప్రస్తుతం సినిమా డిజిటల్ రైట్స్ తో మార్కెట్ ను శాసిస్తున్న అమేజాన్ ప్రైమ్.. సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ తో కూడా అదరగొడుతుంది. నెట్ ఫిల్క్స్ కు గట్టి పోటీ ఇస్తున్న అమేజాన్ సౌత్ మీద బాగా దృష్టి పెట్టింది. అందుకే ఇక్కడ ప్రతి సినిమాకు భారీగా డబ్బులిచ్చి మరి అమేజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేస్తుంది.      


ఇక ఇప్పుడు మరో మెట్టు ఎక్కి సౌత్ స్టార్స్ తో వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తుంది. అందులో భాగంగా సౌత్ క్రేజీ స్టార్ హీరోయిన్ సమంతతో అమేజాన్ ప్రైమ్ నిర్వాహకులు డిస్కషన్స్ చేసినట్టు తెలుస్తుంది. అమేజాన్ ప్రైమ్ లో సమంత వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారట. 


పెళ్లి తర్వాత హీరోయిన్ గా కూడా సూపర్ ఫాంలో ఉన్న సమంత ఇప్పుడు వెబ్ సీరీస్ కు రెడీ అవుతుంది. అమేజాన్ తో సమంత వెబ్ సీరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో వస్తుందట. ఇది కూడా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తారట. ఇప్పటికే అమేజాన్ ప్రైమ్ ఫాలోవర్స్ భారీగా పెరుగుతుండగా వారిని మరింత పెంచేలా అమేజాన్ ప్రైమ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.      


ఈమధ్యనే ఓ బేబీ అంటూ సూపర్ హిట్ కొట్టిన సమంత అమేజాన్ తో చేతులు కలిపిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత మరోసారి నందిని రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తుందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: