గీత గోవిందం విడుదలకు ముందు లీకైన సీన్స్ లో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల మధ్య లిప్ లాక్ సినిమాలో ఉందన్న ప్రచారం.. కర్ణాటకలో పెద్ద సంచలనం రేపిందన్న సంగతి అందరికి తెలిసిందే. దానికి కారణం అప్పటికే రష్మిక కు నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ కావడమే. అతని ఫాన్స్ రష్మికను సోషల్ మీడియాలో బాగా టార్గెట్ చేసి మాట్లాడారు. అందుకనే సినిమా చివర్లో వచ్చే బస్సు సీన్ లో దాన్ని తెలివిగా కవర్ చేసి మేనేజ్ చేశారు. ఇక గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయ్యాక రష్మిక నిశ్చితార్థం రద్దు చేసుకుంది. 

ఈ విషయంలో చాలా విమర్శలు వచ్చినప్పటికీ తెలివిగా వాటికి సమాధానమిచ్చి ఊరుకున్న రష్మిక ఇప్పుడు మరోసారి డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండకు ఒకటి రెండు కాదు ఏకంగా ఐదారు లిప్ లాక్ కిస్సులు ఇచ్చినట్టు ట్రైలర్ లోనే చూపించారు. దీని గురించి ప్రస్తావించినప్పుడు రష్మిక..కోపం ప్రేమ బాధ తరహాలో ముద్దు పెట్టుకోవడం కూడా ఒక ఎమోషన్ అని.. డియర్ కామ్రేడ్ లో కథ ప్రకారం అవి కావల్సినన్ని ఉన్నాయని తెగేసి చెప్పింది. 

కావాల్సినన్ని అని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటో కానీ ఇది మాత్రం యాంటీ ఫాన్స్ కు కౌంటర్ గానే భావిస్తోంది కన్నడ మీడియా. డియర్ కామ్రేడ్ కన్నడలోనూ డబ్బింగ్ అవుతోంది. గీతం గోవిందం కేవలం తెలుగు వెర్షన్ కాబట్టి కన్నడ వాళ్ళు ఎంత మంది చూసుంటారో కానీ ఇప్పుడీ మూవీ ఎక్కువ జనానికి రీచ్ కావడం ఖాయం. కాబట్టి ఆ కోణంలోనే కావాల్సినన్ని ముద్దులు ఉన్నాయని అని చెప్పిందేమోనని చాలామంది అనుకుంటున్నారు. మొత్తానికి కామ్రేడ్ సెన్సేషన్ కర్ణాటకలోనూ ఈసారి కాస్త గట్టిగానే ఉండేలా ఉంది. అయినప్పటికి ఈ లిప్ లాక్స్ కోసం మళ్ళీ చూడాలని మొహం వాచిపోయి ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నరో ప్రత్యేకంగా చెప్పాలా..?



మరింత సమాచారం తెలుసుకోండి: