నాగన్న దర్శకత్వంలో కురుక్షేత్ర అనే సినిమా రూపొందుతోంది. మహాభారతంలో కీలకమైన కురుక్షేత్ర యుద్దాన్ని ముఖ్య కథగా చేసుకుని ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమాలో ముఖ్యపాత్రలో పలువురు ప్రముఖ నటులు నటించారు. అందులో అర్జునుడి పాత్రా ఇప్పుడు తెరపైకి వచ్చింది. 


కన్నడలో రూపొందుతున్న ఈ కురుక్షేత్ర చిత్రం బాహుబలి రికార్డ్స్ బద్దలు కొడుతుంది అని అక్కడ ప్రజలు అంచనాలు వేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో రవించంద్రన్, ధుర్యోధ‌నుడిగా దర్శన్, ద్రౌప‌దిగా స్నేహ‌, భీష్ముడిగా దివంగ‌త నటుడు అంబ‌రీష్ కనిపించగా అర్జునిడి పాత్రలో మన పశుపతి అదేనండి సోనూసూద్ నటించాడు.


ఈ సినిమా కన్నడలో రూపొందినప్పటికీ బాహుబలి చిత్రంలనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల చెయ్యనున్నారు. కురుక్షత్రలో తన పాత్ర గురించి సోనూసూద్ మాట్లాడుతూ 'ఇలాంటి పాతకాలం సినిమాలో నటించడం నాకు కొత్త అనుభవం. ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన సెట్టింగ్లు, గుర్రాలు, యుద్ధ వాతావరణంలో 600 మంది ఆర్టిస్టులను చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి' అని అన్నారు సోను సూద్. అయితే కన్నడ పరిశ్రమ ఊహించినట్టు ఈ సినిమా బహుబలి రికార్డ్స్ బద్దలుకొడుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: