శ్రీహరికి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే కాకుండా హీరోగాను అప్పట్లో చాలా పేరుండేది. మాస్‌ని అమితంగా మెప్పించిన శ్రీమరి అకాల మరణంతో తెలుగు చిత్ర సీమకి పూడ్చలేని లోటు మిగిలిపోయింది. తండ్రి బాటలోనే నటనని కెరియర్‌గా ఎంచుకున్న శ్రీహరి పెద్ద కొడుకు మేఘాంష్‌ శ్రీహరి మొదటి సినిమా విషయంలో చాలా తొందర పడ్డాడు. ఇంకా హీరో ఫీచర్స్‌ రాకపోయినా, చిన్న వయసులోనే హీరోగా మొదటి అటెంప్ట్‌ చేసేసాడు. 


ఫస్ట్‌ చిత్రాన్ని ఏదైనా పేరున్న బ్యానర్‌లో తెలిసిన దర్శకుడితో చేయకుండా 'రాజ్‌దూత్‌' లాంటి చిన్న సినిమా చేసాడు. దీంతో ఈ చిత్రానికి కనీస ప్రచారం కూడా దక్కలేదు. వేరే సినిమాలతో పోటీగా విడుదల చేయడంతో మీడియా కూడా దీనిని పట్టించుకోవడం లేదు. చూసిన ఆ కొద్ది మంది కూడా పెదవి విరుస్తున్నారు. 


మరికొన్నాళ్లు ఆగిన తర్వాత హీరోగా ట్రై చేసి వుండాల్సినదని, శ్రీహరి కొడుకు అనే ట్యాగ్‌ని బాగా వాడుకుని వుండాల్సిందని, ఇలా ఊరు, పేరు లేని సినిమా చేయడం వల్ల మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నాడని అంటున్నారు. రాజ్‌దూత్‌ డిజాస్టర్‌ అయ్యే దిశగా సాగుతోంది కనుక కనీసం రీలాంఛ్‌ అయినా సరిగ్గా ప్లాన్‌ చేసుకుంటే తండ్రి పేరుతో నిలదొక్కుకోగలడు.


మరింత సమాచారం తెలుసుకోండి: