ఒకప్పుటి సూపర్ హిట్ సాంగ్స్ ని రిమేక్ చేసి తమదైన స్టైల్లో పాడుతు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రముఖ పాప్ సింగర్ బాబా సెహగల్.  తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ తో అలరించారు.  ఆ మద్య బాలీవుడ్ లో ఎన్నో రిమేక్ సాంగ్స్ ని పాప్ సాంగ్స్ గా ఎంతో మంది ఆలపించి మంచి హిట్స్ అందుకున్నారు.  ఇప్పటికీ కొన్ని రిమేక్ సాంగ్స్ ని తమదైన స్టైల్లో పాడుతూ హిట్స్ కొడుతున్నారు. 

తాజాగా  ప్రముఖ సంగీత దర్శకుడు బాబా సెహగల్ ఈ మద్య వస్తున్న రిమీక్స్ సాంగ్స్ పై అసహనం వ్యక్తం చేశారు.  అసలు ఈ మద్య వస్తున్న రిమీక్స్ వల్ల ఒరిజినల్ సాంగ్  సారాంశం నాశనమవుతోందంటూ ఇన్‌స్టాగ్రాం వేదికగా మండిపడ్డారు. నాటి గీతాల్ని రీమిక్స్ చేసే పద్ధతికి ఇక స్వస్తి చెప్పాలన్నారు. బాలీవుడ్ ‘కాపీవుడ్’లా తయారైందంటూ బాబా సెహగల్ ఆవేదన వ్యక్తం చేశారు. రీమిక్స్ వెర్షన్‌ సంగతేమో కానీ అసలు గీతం సారాంశం నాశనమవుతోందన్నారు.

రీమిక్స్ గీతాల్లో కొత్తదనం ఏమీ ఉండట్లేదని కళాకారులు ప్రయోగాలు చేయాలని సూచించారు. ఒక రిమేక్ సాంగ్ ని కంపోజ్ చేయడానికి ముందు సంగీత దర్శకుడు ఆ సాంగ్ కి పూర్తి న్యాయం చేయగలడా..సింగర్ పూర్తి స్థాయిలో ఆ పాట సరైన పద్దతిలో పాడగలరా అని ఆలోచించాలని అన్నారు.  హిట్ గీతాల్ని తమ వెర్షన్‌లో పాడిన గాయకులను, రియాల్టీ షోలలో అద్భుతంగా పాడుతున్న చిన్నారులను తాను చూశానన్నారు.

ప్రశంసలు, విమర్శలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.  రీమిక్స్ పేరుతో పాట అద్భుతంగా రాకపోగా..  అసలుకే ఎసరొస్తోందన్నారు. పాత గీతాల్ని రీమిక్స్ చేయాలనుకునే నిర్మాతలు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలని, కొత్తవారికి అవకాశమిస్తే ప్రతిభ బయటకు వస్తుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: