కేజిఎఫ్ సినిమా తీసింది కన్నడంలో అయినా సౌత్ ఇండియా మొత్తం ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఒక్కసారి కేజిఎఫ్ సినిమాను చూస్తే మళ్ళీమళ్ళీ చూడాలనిపిస్తుంది అదే చిత్రాన్ని చూడాలి అనిపిస్తుంది అంత బాగా తీశారు ఆ చిత్రాన్ని. ఈ ఒక్క చిత్రంతో ప్రపంచం అంత సౌత్ ఇండియాను చూసేలా సినిమాను చిత్రీకరించాడు కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నిల్. 


కేజిఎఫ్ చిత్రం హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నిల్ తెలుగు ప్రజలకు పరిచయం లేకున్నా హీరో యాక్టింగ్ తో, దర్శకత్వంతో తెలుగు ప్రజల మనసులను దోచుకుంది కేజిఎఫ్ చిత్రం టీం. ఇక్కడ తెలుగు సినిమాలకు కూడా పోటీ వచ్చింది. బాలీవుడ్ లో గట్టి పోటీనిచ్చింది ఈ చిత్రం. అసలు పరిచయం నటులు చేసిన ఇంత హిట్ అవుతే.. పరిచయం ఉన్న నటులతో సినిమా చేస్తే ఇంకెంత పెద్ద హిట్ అవుతుంది అని ఆలోచినట్టున్నారు. 


అందుకే మన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కేజిఎఫ్ 2 చిత్రంలో ఒక పాత్రా చెయ్యనున్నారట. బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ కూడా కేజిఎఫ్ 2 చిత్రంలో విలన్ పాత్ర చేయనున్నారట. అసలు పరిచయం లేని నటులు చేస్తేనే తెలుగులో సినిమా అంత హిట్ అయ్యింది అంటే మన తెలుగు వాళ్ళు కూడా చేస్తే ఇంకెంత హిట్ అవుతుందో మీరే ఊహించుకోండి. కాగా విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్'కు యాష్(కేజీఎఫ్ రాఖీ బాయ్) ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: