క‌ళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స‌మ‌యంలో చాలా రోజుల తరువాత ‘118’ సినిమాతో ఓ మోస్త‌రు హిట్ కొట్టాడు. ఇక ప్ర‌స్తుతం ‘తుగ్లక్’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు వేణు మల్లిడి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. అయితే ఇటీవ‌ల సంప‌త్‌నంది నందమూరి కళ్యాణ్ రామ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.


సంపత్ నంది చెప్పిన కథ బాగుండటంతో కళ్యాణ్ రామ్ సినిమా చేయడానికి  ఓకే చెప్పాడ‌ట‌. రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా తీసిన సంపత్ నంది.. ఈ మధ్య సరైన హిట్ ఇవ్వడంలో వెనుక ప‌డ‌డంతో ఆ త‌ర్వాత సంప‌త్ నంది- గోపీచంద్ కాంబినేష‌న్‌లో సినిమా చేయాల‌నుకుంటే అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్‌- సంప‌త్ కాంబినేష‌న్లో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళ్తుండో క్లారిటీ లేదు.


అయితే వ‌రుస ఫ్లాపుల‌తో సంప‌త్ నంది ఫామ్‌లోనే లేడు. ఇలాంటి స‌మ‌యంలో క‌ళ్యాణ్ రామ్ సంప‌త్‌కు ఛాన్స్ ఇచ్చి త‌ప్పు చేశాడా? అన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. ఇక 118తో ఎట్ట‌కేల‌కు ఐదేళ్ల త‌ర్వాత ఫామ్‌లోకి వ‌చ్చిన క‌ళ్యాణ్ ఆ ఫామ్‌ను అలా కంటిన్యూ చేయ‌కుండా ఇప్పుడు సంప‌త్ లాంటి ప్లాప్ డైరెక్ట‌ర్‌కు ఎందుకు ఛాన్స్ ఇచ్చాడో అర్థం కాని ప‌రిస్థితి. మరి సంపత్ నంది, కళ్యాణ్ రామ్‌కు హిట్ ఇచ్చి త‌ను కూడా స‌క్సెస్ కొడ‌తాడేమో  ?  చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: