వరుణ్ సందేశ్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీకాదు. ‘హ్యాపీడేస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఎన్నారై సుమారు 20 సినిమాల్లో చేశారు. వీటిలో హీరోగానే ఎక్కువ సినిమాలున్నాయి. ఈ సినిమాల ద్వారా తనకంటూ తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు కానీ, హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. 2015లో హీరోయిన్ వితిక షెరును వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు బాగా దూరమైపోయారు. 


ఇటీవలే నువ్వు తోపు రా అనే సినిమాలో ఓ పాత్ర పోషించాడు కానీ అది డిజాస్టర్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడీ బిగ్ బాస్ 3 ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ నెల 21 నుంచి బిగ్‌బాస్‌-3 తెలుగులో ప్రారంభం కానుంది. నిన్న మొన్నటి వరకు హోస్ట్ గురించి రకరకాల వార్తలొచ్చాయి. మొత్తానికి హోస్ట్ ఎవరో కన్ఫార్మ్ అయిపోయింది. కింగ్ నాగార్జున ఈసారి ‘బిగ్ బాస్’ హౌజ్‌లోని కంటెస్టెంట్లను తన కనుసైగలతో కట్టడి చేయబోతున్నారు. 


ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రోమోలు చాలా ఆస‌క్తిక‌రంగా మారాయి. ఈ రియాలిటీ షోలో మొత్తం 15 పార్టీసిపెంట్స్ ఉండబోతున్నారు. హౌస్‌లో ఎవరు ఉంటారు అనే లిస్ట్ అఫీషియల్ గా ఇంకా బయటికి రాలేదు... అయితే హీరో వరుణ్ సందేశ్ ఉండబోతున్నాడన్న కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. మ‌రి ఇలాంటి రియాలిటీ షోలో వ‌రుణ్ సందేశ్ లాంటి వాళ్లు ఉంటే ట్విస్టులు అదిరిపోతాయి క‌దా...!



మరింత సమాచారం తెలుసుకోండి: