'మహర్షి' సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీదున్న మహేష్ బాబు అనిల్ రావిపూడి తో చేయబోయే సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హ్యాట్రిక్ కొట్టి దూసుకెళ్లి పోయే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా మహర్షి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక రికార్డులు సృష్టించిన మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో కూడా రికార్డులు సృష్టిస్తాడని సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు.


అంతేకాకుండా ఈ సినిమాకి  సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు వర్క్ చేస్తారని వార్తలు రావడంతో అతను ఉంటే చాలు మా మహేష్ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు అభిమానులు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అంటే మహేష్ కి కూడా మంచి అభిమానం..ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా కి వర్క్ చేస్తున్నారు.


సైరా సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల ముగియడంతో త్వరలో మహేష్ బాబు నటించబోయే సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో రత్నవేలు జాయిన్ అవుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో సినిమా పై మహేష్ అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: