ఈమధ్య పోసాని ఆరోగ్యం పై మీడియాలో అనేక నెగిటివ్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక ప్రముఖ హాస్పటల్ లో సర్జరీ చేయించుకుని కొద్ది రోజులుగా ఇంటి వద్దనే పోసాని విశ్రాంతి తీసుకుంటూ షూటింగ్ లకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీనితో ఈ గ్యాప్ ను ఆధారంగా చేసుకుని తన ఆరోగ్యం పై వచ్చిన అనేక నెగిటివ్ వార్తల పై పోసాని ఘాటుగా స్పందించాడు.

పోసాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మళ్ళీ పోసాని హాస్పటల్ లో చేరాడని వచ్చిన వార్తల పై పోసాని తన సహజ స్టైల్ లో స్పందించాడు. తన పై నెగిటివ్ వార్తలు వస్తున్న విషయం తనకు తన స్నేహితులు ద్వారా తెలిసిందని అంటూ తాను మాట్లాదగలుగుతున్నాను అంటే తన ఆరోగ్యం బాగున్నట్లే కదా అంటూ పోసాని సెటైర్ వేసాడు. 

యశోద హాస్పటల్ డాక్టర్లు తన అనారోగ్యాన్ని పూర్తిగా తగ్గించిన విషయాన్ని తెలియ చేస్తూ మరో వారం పదిరోజులలో తాను షూటింగ్ లకు కూడ వెళ్ళబోతున్న విషయాన్ని బయట పెట్టాడు. తన ఆరోగ్యం గురించి ఆందోళన పడుతూ ఎంక్వైరీ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియ చేసాడు పోసాని. 
  

తన నడుము కింది భాగంలో గజ్జల్లో ఇబ్బంది కిలిగిన పరిస్థుతులలో తాను సరిగ్గా నడవలేక పోయానని అయితే ఆ సమస్యకు యశోద హాస్పటల్ లో వైద్యులు చాల చక్కటి వైద్యాన్ని అందించిన విషయం పోసాని తెలియ చేసాడు. వాస్తవానికి తనకు ఈ సర్జరీ గత మూడు నెలల క్రితమే జరగవలసి ఉన్నా ‘మహర్షి’ తో పాటు మరికొన్ని సినిమాలలో తాను బిజీగా ఉండటంతో ఈ ఆలస్యం జరిగినట్లు పోసాని వివరించాడు. పోసాని ఆరోగ్యం పై క్లారిటీ రావడంతో ఇప్పడు అతడి అభిమానులు ఆనందంగా ఉన్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: