టాలీవుడ్, కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య తాజాగా ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే పిల్లలు మూడు భాషలు(మాతృభాష-ఇంగ్లిష్-హిందీ) నేర్చుకోవాలని ఒత్తిడి చేయడం సరికాదని   తెలిపాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ విద్యావిధానం-2019 ముసాయిదాను విడుదల చేసింది. ఇందులో భాగంగా హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాల స్థాయిలో హిందీని కచ్చితంగా అమలు చేయాలని సిఫార్సు చేసింది. దీనిపై తమిళనాడులోని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిబంధనను ఎత్తివేసింది. 

ఇటీవల సూర్య రాజకీయ కోణంలో పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మద్యే ఎన్ జీకె సినిమాలో నటించిన ఆయన సొసైటీలో రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చూపించారు.  చిన్నతనంలోనే మూడు భాషలు నేర్చుకోవడం పిల్లకు చాలా ఇబ్బంది కరంగా ఉంటుందని..తన పిల్లలకు ఈ మూడు భాషలు నేర్పించడం తమకే ఎంతో కష్టంగా ఉందని ఆయన  వ్యాఖ్యానించాడు. దేశంలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ టీచర్లు లేరనీ, ఇది దారుణమని అన్నాడు.

అందరికీ సమానమైన అవకాశాలు లేనప్పుడు జాతీయ వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్)లో ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. ఈ మద్య ప్రభుత్వం స్కూళ్లకన్నా సమాజంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లే ఎక్కువ ఉన్నాయని..వాటికే విపరీతమైన డిమాండ్ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానం ముసాయిదాపై అందరూ స్పందించాలని సూర్య విజ్ఞప్తి చేశాడు. లేదంటే గ్రామీణ విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతాయని హెచ్చరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: