బిగ్ బాస్ లోకి జాఫర్ వస్తున్నడా ? ఇంకేముంది ఆ షో లో రోజు గొడవలే ... జాఫర్ గారు అక్కడా ఇంటర్వ్యూ చేస్తారు.. అందరితో కొట్టించుకోడానికి, అందరికి కోపాలు తెప్పించడానికి రెడీగా ఉంటాడు జాఫర్.. అని టీవీ 9 విడుదల చేసిన బిగ్ బాస్ కాంటెస్టెంట్ల లిస్టు వీడియోకు కామెంట్లు పెట్టారు నెటిజన్లు. ఈ కామెంట్లకు కారణం ఉంది.. టీవీ9 జాఫర్ ముఖాముఖీ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు ఈ కామెంటే పక్క పెడతారు..


అంతటి ఘనత ఉంది ఈ జర్నలిస్ట్ 'జాఫర్'కి. ముఖాముఖీ కార్యక్రమంలో ఇంటర్వ్యూర్స్ కి చుక్కలు చూపిస్తున్నా అనుకోని ఎప్పుడు పప్పులో కాలేస్తుంటారు.. ఉదాహరణ కమెడియన్ సునీల్ ని ఇంటర్వ్యూ చెయ్యడానికి పిలిచారు. ఆ సమయంలో సునీల్ హీరోగా నటించి అప్పుడప్పుడే ట్రాక్ లోకి వస్తున్నారు. అలాంటి సునీల్ ని పట్టుకొని .. మీరు కమెడియన్ గా ఓకే? మీరు హీరో అయ్యేంత సీన్ మీకు ఉందంటారా ? మీ మోకాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? అని డైరెక్ట్ ఆడిగేసాడు.. ఈ ప్రశ్నకు సర్రున కాలింది సునీల్ కి.


అందంగా ఉన్న ఒక్క హీరోని చూపించండి.. ఒక్క సూపర్ స్టార్ ని చూపించండి అని సునీల్ అంటే ..మీరు ఫీల్ అవ్వకండి అని అన్నాడు జాఫర్.. దీంతో సునీల్ మీరు ఫీల్ అయ్యేలా ప్రశ్నలు అడిగి ఫీల్ అవ్వకండి అని అంటారెంటి అని ప్రశ్నించాడు.. ఇలా ఒకరిని కాదండి జాఫర్ తన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టింది. ఆర్కే రోజాని, హేమ, మోహన్ బాబు ఇలా ఎంతోమందీని తన ఇంటర్వ్యూతో ఇబ్బంది పెట్టాడు.. అలాంటి జాఫర్.. ఇప్పటికే కేర్ ఆఫ్ కంట్రోవర్సీ బిగ్ బాస్ కి వస్తే అతని ప్రశ్నలతో, అతనే హోస్ట్ అనుకోని మిగితా వారికి చుక్కలు చూపించే అవకాశాలు చాలా ఉన్నాయి.. మరి నిజంగా జాఫర్ బిగ్ బాస్ కి వస్తున్నారా లేక సోషల్ మీడియా గాసిప్ ఆ అనేది తెలియాలి అని విశ్లేషకులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: