రాధికా ఆప్టే బోల్డ్ గా స్టేట్మెంట్స్ ఇవ్వగలదు. బోల్డ్ గా తెర మీద కనిపిస్తూ అభిమానులకు పిచ్చెక్కించగలదు. అయితే ఈమధ్య దేవ్ పటేల్ తో ఘాటు రొమాన్స్ చేసిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో మంటలు రేపింది. అది 'ది వెడ్డింగ్ గెస్ట్' లోని శాంపిల్  అనే సంగతి తెలిసిందే. ఆ సినిమా సంగతేమో కానీ  రాధిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా హాట్ ఫోటోలతో హీట్ పెంచే ప్రయత్నాలు కూడా చేస్తుంటుంది. 


తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ ద్రాక్షపండ్ల గుత్తి ఎమోజి పెట్టింది.  ఆ గుత్తి అర్థం రాఘవేంద్ర రావుగారి లాంటి కళాపోషకులకు తప్ప సాధారణ నెటిజన్లకు అర్థం అయ్యేలా లేదు. ఫోటోలో రాధిక వైట్ టాప్.. ఆలివ్ గ్రీన్ కలర్ శాటిన్ మిడ్డీ ధరించింది..  తన రెండు చెతులనూ పైకెత్తి చిరునవ్వులు చిందిస్తూ పోజిచ్చింది.


 ఆ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు.  "ఇంత న్యాచురల్ గా ఉండేందుకు ఏం చేస్తావు".. "సింప్లీ మైండ్ బ్లోయింగ్".. "స్కర్ట్ సూపర్.. రాధిక రాక్స్".. "స్కర్ట్ ఈజ్ ఎ రియల్ కిల్లర్" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక రాధిక నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే  'ది ఆశ్రమ్' అనే ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: