2019 సంవత్సరంలో ఇప్పటికే ఆరునెలలు గడిచిపోయాయి. ఈ ఆరునెలల్లో దాదాపు చిన్నా పెద్దా అని తేడా లేకుండా 70దాకా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఇందులో హిట్టు అయిన సినిమాలు మాత్రం కేవలం పది మాత్రమే. జనవరి నెలలో విడుదలైన సినిమాల్లో ఎఫ్ 2 సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కెరీర్లలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది ఈ సినిమా. 
 
ఫిబ్రవరిలో విడుదలైన సినిమాల్లో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమా పరవాలేదనిపించే విధంగా కలెక్షన్లు తెచ్చుకోగా మార్చి 1 న విడుదలైన 118 కల్యాణ్ రామ్ కెరీర్లో పటాస్ తరువాత హిట్ సినిమాగా మిగిలింది. ఏప్రిల్ నెల మాత్రమే టాలీవుడ్లో అంతో ఇంతో విజయాలు అందించిన నెల. ఏప్రిల్ నెలలో విడుదలైన చిత్రలహరి సినిమా వరుస ఫ్లాపుల్లో ఉన్న సాయిధరమ్ తేజ్ కు సక్సెస్ ఇచ్చింది. 
 
ఏప్రిల్ నెలలోనే ఒకేరోజు విడుదలైన జెర్సీ, కాంచన రెండు సినిమాలు హిట్టయ్యాయి. జెర్సీ సినిమా క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోగా కాంచన సినిమా మాస్ ప్రేక్షకులను అలరించింది. మే నెలలో విడుదలైన మహేశ్ బాబు మహర్షి కమర్షియల్ గా మంచి విజయాన్ని నమోదు చేసింది. జూన్ నెలలో విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా మంచి కలెక్షన్లే తెచ్చుకున్నాయి. సెకండాఫ్లో ఓహ్ బేబీ సినిమాతో హిట్టు కొట్టింది సమంత. మరి ఫస్టాఫ్లో కేవలం పది హిట్లే కొట్టిన టాలీవుడ్ ఇండస్ట్రీ సెకండాఫ్లోనైనా భారీగా హిట్లు అందుకోవాలని ఆశిద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: