మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. మెగాస్టార్ గా ఆయన సాధించిన పేరుప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా మారుమ్రోగి పోయాయి. ముఖ్యంగా 90వ దశకంలో ఆయన క్రేజ్ ఏస్థాయిలో ఉండేదో చెప్పటానికి మాటలు, రాయటానికి పదాలు కూడా చాలవు. వరుసగా ఆరు ఇండస్ట్రీ హిట్ లతో మెగాస్టార్ గా ఎవరెస్టు శిఖరమంత క్రేజ్ సంపాదించి అభిమానుల గుండెల్లో చిరంజీవి గా నిలిచిపోయారు.

 

1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా సమయంలో ఆయన ఓపత్రికకు ఇచ్చిన స్టిల్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. రాబిన్ హుడ్ బాడీతో ఫుల్ ఫిట్ నెస్ తో ఉన్న అప్పటి చిరంజీవి ఫోటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్స్ లేని రోజుల్లోనే చిరంజీవి ఇంత ఫిట్ గా ఉండడం చూసి ఆయన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. 80-90 దశకంలో ఆయనను అభిమానించిన చిన్నపిల్లలు, యువత ఇప్పుడు ఆయన ప్రధాన అభిమానులుగా స్థిరపడిపోయారు. వారంతా ఇప్పుడు ఈ స్టిల్ చూసి ఆరోజులను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఫుల్ మాస్ టచ్ తో జీన్స్ షర్ట్ బటన్స్ తీసేసి విశాలమైన ఛాతీతో ఠీవీగా నిలబడిన ఫోటో నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

తెలుగులో చిరంజీవి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఆయన డాన్సులు, ఫైట్లు ఓ సంచలనం. ఇప్పటికీ ఆయనను ఆదర్శంగా తీసుకునేవారు,  ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని తపించేవారెందరో. ఆయనను చూసి ఇన్స్ పెయిర్ అయి సినిమాల్లోకి వచ్చినవారున్నారు.  ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమాను పూర్తి చేశారు. 152వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో చేసేందుకు రెడీ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: