మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో ప్రారంభం కానుంది. ఇప్పటికే షో కి సంబంధించిన ప్రోమో విడుదల చేసి తెలుగు టెలివిజన్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు షో నిర్వాహకులు. తాజాగా జరగబోయే షోలో వంద రోజులు...15 మంది ఇంటి సభ్యులు పాటిస్పేట్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


అంతేకాకుండా చాలా మంది అధికారికంగా కాకుండా అనధికారికంగా ఇంటి సభ్యుల పేర్లు కూడా వినబడుతున్నాయి. దీంతో వచ్చిన వార్తల్లో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరో గా నటించిన వరుణ్ సందేశ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైన వార్త అయితే కచ్చితంగా బిగ్ బాస్ లో వరుణ్ సందేశ్ టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఉంటాయని వీక్షకులు కామెంట్లు చేస్తున్నారు. 


హ్యాపీ డేస్ తో పరిచయమై కొత్త బంగారు లోకం సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ దాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. హిట్లు సింగల్ డిజిట్ లో ఉంటే ఫ్లాపులు డబుల్ డిజిట్ దాటేశాయి దీంతో పరిశ్రమకు త్వరగానే దూరమైన వరుణ్ సందేశ్ యుఎస్ లో సెటిలైపోయాడు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 జులై 21న మొదలు కాబోతున్న క్రమంలో వరుణ్ పేరు సోషల్ మీడియాలో బాగా వినబడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: