మనుషులకు, జంతువులకు ఓ తేడా ఉంది. మనం సంఘంలో ఉంటున్నాం, కట్టుబాట్లు కూడా మనమే పెట్టుకున్నాం. ఆ సంఘానికి బద్ధులై జీవించాలి. సంఘం శరణం గచ్చామీ అన్న బుద్ధుడు జన్మించిన దేశం ఇది. మరి ఏం ఏమైనా చేస్తామంటూ తెగిస్తే నా అందం, నా ఇష్టం అంటే ఇక కట్టుబాటు ఎక్కడుతుంది, కట్టుకున్నది విప్పేయడం తప్ప.


ఆమె సినిమాలో న్యూడ్ గా కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసినా అమలాపాల్ ఇపుడు రెబెల్ గా మాట్లాడుతున్నారు. మన సంఘంలో ఇలాంటివి అంగీకరించరు కదా? అని మీడియా ప్రశ్నిస్తే .. అవన్నీ ఆలోచిస్తే నేను నటిని అయ్యేదానిని కాదని అమలాపాల్ అన్నారు. పెయింటర్ నగ్నంగా ఉన్న మహిళను పెయింటింగ్ చేస్తారు. ఆస్పత్రికి వెళితే గైనకాలజిస్ట్ చికిత్స చేస్తారు. ప్రతిదానికీ కండిషన్లు పెడితే కుదరదు. ఈ సంఘం నన్ను జడ్జ్ చేస్తుంది అని ఆలోచిస్తూ కూచోలేను. ఎంపిక చేసుకున్న పాత్రకు న్యాయం చేయడమే నా పని.. అయినా టీజర్ చూసి సినిమా మొత్తాన్ని నిర్ణయించకూడదు.  మొత్తం సినిమా చూశాక అందరూ కన్విన్స్ అవుతారు అంటూ గట్టిగా రిప్లై ఇస్తోంది.


ఇక ఆమె మూవీలో  నగ్నత్వం వెనక కారణం చూస్తారు. అయినా ఏదో ఒక సాంగ్ కోసమే బట్టలు విప్పేస్తున్నారు నటీమణులు. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే కంటెంట్ ఉన్న సినిమా కోసం నేను ఇలా చేయడం తప్పేమీకాదు.. అని అమలాపాల్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. నగ్నంగా ఉండే సన్నివేశాలు తెరకెక్కించేప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే సెట్ లో ఉన్నారని అమలాపాల్ తెలిపారు.  మొత్తానికి లైం లైట్ లో ఇన్నాళ్ళూ  లేని అమలాపాల్ ఒక్కసారిగా సంచలనం  అయ్యారంటేనే న్యూడ్ కి ఉన్న పవరేంటో తెలుస్తోంది కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: