వరల్డ్ కప్ చివరి వరకు నరాలు తెగిపోయేంత ఉత్కంఠగా ఆటా కొనసాగింది.. అసలు ఆటలో గెలుపుని పక్కన పెడితే ఆట ఎంత బాగా కొనసాగింది అనేది ముఖ్యం. ప్రపంచ కప్ లో మన భారత్ ఒడిపోయినప్పటికి, క్రికెట్లో మనల్ని ఓడించిన వారు ఆడినప్పటికి, మన భారత్ క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా మ్యాచ్ ను చూసారు. అసలు ఎవరు గెలుస్తారు అని ఇంగ్లాండ్ వారికంటే ఎక్కువ టెన్షన్ తో ఎదురు చూసినట్టున్నారు మన భారతీయులు.


అందుకే భారత్ లో రాత్రి 12 గంటలు అయినప్పటికీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేసుబుక్, వాట్సాప్ లో  ఆగకుండా ఇంగ్లండ్ విజయానికి శుభాకాంక్షలు చేసుపతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కేటీఆర్, నారా లోకేష్ ఇంగ్లండ్ టీంకు శుభాకాంక్షలు చెప్తూ, న్యూజిల్యాండ్ కు కూడా ఈ విజయం వరిస్తుంది అని ట్విట్ చేశారు. 


అయితే నితిన్ హీరోగా రూపొందే 'బిష్మ' సినిమాలో నటిస్తున్న వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కి కాసేపు బ్రేక్ దొరికింది. ఆ సమయంలో వారు క్రికెట్ చూసినట్టున్నారు.. అంతే దాని గురించి చర్చించుకుంటున్నారు. ఆ వీడియో లో ర్ల మాట్లాడుకుంటున్నారు 'వెన్నెల కిషోర్ సెల్ఫీ వీడియో ఆన్ చేసి బ్రహ్మాజీ చెప్పేది వింటున్నారు. బ్రహ్మాజీ చెప్తూ 'ఆట టై అయ్యింది, సెకండ్ టైం కూడా ఆట టై అయ్యింది అప్పుడు ఎం చేస్తారు. కప్ రెండు టీమ్స్ కి ఇస్తారా ? అని' వెన్నెల కిషోర్ ని అడిగితే బౌండరీస్ దాటినా వాళ్ళకి కప్ ఇస్తారు అంటే అలా ఎలా ఇస్తారు అని బ్రహ్మాజీ అంటే.. వీడియో తీస్తున్న చూడు అని వెన్నెల కిషోర్ అంటే ఫోటో అనుకోని పోజ్ ఇస్తాడు. దీంతో ఇది వీడియో రా ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు ఇస్తావ్ ఏంటి అని' వీడియో ఆపేస్తాడు వెన్నల కిషోర్. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: