రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా బిజీలో ఉన్నాడు.  కొన్ని రోజులు ఈ సినిమాకు గ్యాప్ రావడంతో మెగాస్టార్ సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకుంటున్నారు.  సమయం దొరికినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఫొటోలు దిగుతున్నాడు.  రామ్ చరణ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో మంచు లక్ష్మి కూడా ఉన్నది.

మంచు లక్ష్మి కూతురితో కలిసి చరణ్ ఫోటో దిగాడు.  ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఫోటో క్షణాల్లోనే వైరల్ అయ్యింది.  ఈ ఫోటోపై మంచు లక్ష్మి స్పందించింది.  చరణ్‌, పాప కలిసి ఉన్న ఈ ఫొటో నాకు పాత రోజుల్ని గుర్తు తెస్తోంది. చరణ్‌.. నేను మీ నాన్నతో కలిసి ఇలాంటి ఫొటోనే దిగా. జీవితం మళ్లీ మొదలైన చోటుకే వచ్చిన భావన కలుగుతోంది. 


మనది ఎంతో అద్భుతమైన ప్రయాణం. ఇలా మన స్నేహం మరిన్ని సంవత్సరాలు కొనసాగాలి. నీకు  పిల్లలు పుట్టిన తర్వాత యాపిల్‌  వాళ్లకి పెద్ద అక్కగా ఉండే రోజు కోసం ఎదురుచూస్తున్నా . ఇన్‌స్టాగ్రామ్‌కు స్వాగతం చరణ్‌’ అని పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ ను చూసిన తరువాత దీనిపై ఉపాసన స్పందించింది.  


దిస్ ఈజ్ సో క్యూట్ అంటూ పోస్ట్ చేసింది.  ఈ ఫొటోకు వేలాది మంది లైక్ లు షేర్స్ చేస్తున్నారు. చరణ్.. ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కు అవుతుంది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: