సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ  క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న  రెండవ సారి జంటగా  'డియర్ కామ్రేడ్'తో  ఈ నెల 26న రాబోతున్నారు. ఇప్పటికే వినూత్నమైన ప్రమోషన్స్ తో  ఆకట్టుకుంటున్న  'డియర్ కామ్రేడ్'..   సినిమాలో రొమాంటిక్ సీన్స్ తో కూడా బాగా ఆకట్టుకుంటాడట. ముఖ్యంగా సినిమాలో  మూడు లిప్ కిస్ లు కాస్త ఘాటుగానే ఉంటాయని తెలుస్తోంది.  రొమాంటిక్  సన్నివేశాల్లో ఈ జంట ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా.. రెచ్చిపోయి మరీ  నటించారట. సినిమాలో ఎమోషన్ పెయిన్ ఎలా ఉన్నా.. యూత్ ని మాత్రం రొమాంటిక్ సీన్స్ తోనే  'డియర్ కామ్రేడ్'  బాగా  మెప్పిస్తాడని సినిమా సంబధించిన వ్యక్తులే చెబుతున్నారు.      


ఇక  ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో రిలీజ్ కానుంది.  కాగా ఈ చిత్రంలో  రష్మిక స్టేట్ లెవెల్ క్రికెట్  ప్లేయర్ గా నటిస్తోండగా.. విజయ్ దేవరకొండ సోషల్ భావాలు ఉన్న స్టూడెంట్ గా..  టిపికల్ లవర్ గా  కనిపించనున్నాడు.  భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ  మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా  ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మరి విజయ్ దేవరకొండకు 'డియర్ కామ్రేడ్' ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: