సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా నిలబెడుతుందో ఎవరికీ తెలియదు.  ఒక్కోసారి ఆకాశానికి ఎత్తుకుతుంది.  ఇంకోసారి అధఃపాతాళానికి తోసేస్తుంది.  అందుకే ఇండస్ట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  సక్సెస్ వచ్చినపుడు పొంగిపోయి కన్నుమిన్ను ఆగకపోతే.. అంతేసంగతులు.  ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటే.. మనకు తెలియకుండా మనలో ఉన్న టాలెంట్ ను మరొకరు మరోలా గుర్తించి అవకాశం ఇవ్వొచ్చు కదా.  అలా అవకాశం దక్కించుకున్న వ్యక్తుల్లో వివి వినాయక్ ఒకరు. 

వివి వినాయక్ మాస్ సినిమాలను తీయడంతో దిట్ట.  ఎన్టీఆర్ ఆది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.  సీమ సినిమాలతో అరడగొట్టాడు.  మెగాస్టార్ తో ఠాగూర్ సినిమా తీసి సంచలన విజయం అందుకున్నా వినాయక్ ఆ తరువాత చాలా సినిమాలు చేసినా.. ఆ స్థాయి విజయాలు అందుకోలేదు.  


రీసెంట్ గా మెగాస్టార్ 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 తో తిరిగి బంపర్ హిట్ అందుకున్న ఈ మెగా దర్శకుడు.. తెరపై కనిపంచబోతున్నాడు.  ఠాగూర్ సినిమాలో ఓ చిన్న రోల్ చేసిన వినాయక్,ఇప్పుడు దిల్ రాజు సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు.  దీనికోసం తన షేపులు మార్చుకోవడానికి జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు.  లావుగా కనిపించే వినాయక్ సడెన్ గా సన్నగా మారిపోయి అందరికి షాక్ ఇచ్చాడు.  


ఈ షాకింగ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.  వినాయక్ ఏంటి ముఖానికి రంగు వేసుకోవడం ఏంటి.  ఖైదీ నెంబర్ 150 తరువాత మరో సినిమా కోసం ప్రయత్నించాడు.  బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీ అన్నా, బాలయ్య మాత్రం స్పందించకపోవడంతో ఖాళీ సమయాన్ని ఇలా యాక్ట్ చేయడానికి వాడుకుంటున్నట్టున్నాడు.    


మరింత సమాచారం తెలుసుకోండి: