యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా  దర్శక ధీరుడు  రాజమౌళి దర్శకత్వంలో  రాబోతున్న  భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'  ప్రస్తుతం  శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటుంది.  ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఎన్టీఆర్ - చరణ్ లతో పాటు  అజయ్ దేవగణ్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అజయ్ దేవగణ్  'ఆర్ఆర్ఆర్'లో  కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే అజయ్ దేవగణ్ కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే సినిమాలో కనిపిస్తారట.  


అయినప్పటికీ.. అజయ్ దేవగణ్ పాత్ర వల్లే  ఎన్టీఆర్ - చరణ్  పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని.. మొత్తానికి అజయ్ దేవగణ్ పాత్ర ప్రేరణాత్మకంగా ఉండనుందని సమాచారం.  ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.   ధృడంగా ఉండే  కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు చేస్తున్నాడు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.  జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: