బుల్లితెర మీద త‌న హాట్ హాట్ అందాల‌ను ఆర‌బోసిన ర‌ష్మి గౌత‌మ్ కుర్ర‌కారుకి మంచి కిక్కిచింది. ఆ త‌ర్వాత వెండితెర మీదకు కూడా ఎంట్రీ ఇచ్చి త‌న న‌ట‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఇంకా చెప్పాలంటే వెండితెర‌మీద కూడా ఆమె న‌ట‌న కంటే అందంతో ఆక‌ట్టుకునేందుకే ప్ర‌య‌త్నించింది. అలాగే హార‌ర్ చిత్రాల్లో న‌టించిన ఆమెకు మ‌రో సారి హోర‌ర్ సినిమాలో ఛాన్స్ దొరికింది. తాజాగా `రాజుగారిగ‌ది 3`లో ఆమె ఛాన్స్ వ‌చ్చింద‌ని తెలుస్తుంది.


ఓంకార్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం ‘రాజుగారి గ‌ది’ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. తన తమ్ముడు అశ్విన్ బాబును హీరోగా పెట్టి ఓంకార్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో చిన్న స్టార్లతో పెద్ద విజయం సాధించిన ఓంకార్.. దానికి సీక్వెల్‌గా తీసిన ‘రాజుగారి గది 2’లోకి మాత్రం నాగార్జున, సమంత లాంటి పెద్ద స్టార్లను తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందింది. 


దీంతో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాను ఓంకార్ తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి మిల్కీ బ్యూటీ తమన్నాను ఆయన నమ్ముకున్నారు. కానీ ఓంకార్ ముందు చెప్పిన స్క్రిప్ట్‌కు.. త‌ర్వాత స్క్రిప్ట్‌కు పొంతన లేకపోవడంతో మిల్కీ బ్యూటీ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. ఇప్ప‌డు ఈ సినిమా మెయిన్ లీడ్‌గా అవికాగోర్‌ను నటింప చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా సినిమాలో మ‌రో కీల‌క పాత్ర కోసం అందాల యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌ను తీసుకున్నార‌ట‌. మ‌రి త్వ‌ర‌లో రాబోతున్న ఈ సినిమాలో ఓంకార్ ర‌ల‌ష్మీని ఏ యాంగిల్‌లో చూపిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: