అక్కినేని నాగార్జున కెరీర్ లో ఎన్నో లవ్, ఎమోషనల్ సినిమాలు వచ్చాయి.  అందులో మణిరత్నం తీసిన ‘గీతాంజలి’మూవీ ఒకటి.  ఆ తర్వాత ఆ తరహా ప్రేమతో పాటు ఫుల్ లెన్త్ ఎంట్ర టైన్ మెంట్ గా వచ్చిన మూవీ ‘మన్మథుడు’.  ఈ సినిమాలో నాగార్జున నిజంగానే మన్మథుడిలా కనిపించడమే కాదు..ఛండశాసనుడిలా కనిపించి కడుపుబ్బా నవ్విస్తాడు. 

కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవి సూపర్ హిట్ తర్వాత సీక్వెల్ కి ప్లాన్ చేశారు..కానీ అది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో ‘మన్మథుడు2’ ముహూర్తం కుదిరింది.  ఈ మూవీలో నాగార్జున సరసన అందా భామలు రకూల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ నటించారు.  తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

నాగార్జున సొంత బ్యానర్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఒక కీలకమైన పాత్రను పోషించింది. వెన్నెల కిషోర్ .. ఐశ్వర్య గౌడ ముఖ్యమైన పాత్రల్లో  కనిపించనున్నారు. ఈ మూవీకి  చైతన్ భరద్వాజ్  మంచి సంగీతం అందించారని టాక్ వినిపిస్తుంది.  'మన్మథుడు' స్థాయిలో 'మన్మథుడు 2' కూడా నాగార్జునకి హిట్ తెచ్చిపెడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: