అభిమానుల నుంచి వచ్చే రెస్పాన్స్, ప్రభుత్వం అందించే అవార్డులు, రివార్డులు కళాకారులకు ప్రోత్సాహకాలు.  ప్రభుత్వం సినిమాకు అవార్డు ఇచ్చింది అంటే అది పెద్ద పండుగలా చేసుకునేవారు.  కానీ, ఇప్పుడు సినిమాకు ప్రైవేట్ భాగస్వామ్యుల నుంచి వచ్చే అవార్డులు తప్పించి ప్రభుత్వం ఎలాంటి అవార్డులు ఇవ్వడం లేదు.  


2011 వ సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ఇచ్చింది.  ఆ తరువాత అవార్డులను రెగ్యులర్ గా ఇవ్వడం ఆపేసింది.  ఆంధప్రదేశ్ విభజన తరువాత ఏపీ ప్రభుత్వం అవార్డులను ఇచ్చింది.  2013, 2013 వ సంవత్సరాలకు గాను అవార్డులను ఇచ్చింది.  


2012లో నానికి, 2013లో మిర్చి సినిమాకు గాను ప్రభాస్ కు ఉత్తమనటుడిగా అవార్డులను ఇచ్చారు. అత్తారింటికి దారేది సినిమాకు అవార్డు రాకపోడంతో అప్పట్లో పెద్ద రగడ జరిగింది.  ఆ తరువాత 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను అవార్డులను అవార్డులను ప్రకటించినా.. వాటి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.  2014కు గాను లెజెండ్ బాలకృష్ణ, 2015 కు గాను శ్రీమంతుడు మహేష్ బాబు, 2016 గాను నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలకు ఎన్టీఆర్ ను ఎంపిక చేశారు.  ఎంపిక జరిగిందిగాని అవార్డులు ఇవ్వలేదు.  


ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  సినిమా రంగానికి చెందిన చాలామంది వైకాపా ప్రచారంలో పాల్గొన్నారు.  ప్రచారం చేశారు.  తెలుగు సినిమా రంగం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందాలి అంటే ఆగిపోయిన నంది అవార్డులను తిరిగి ప్రభుత్వం ప్రకటించాలి.  ఆలా ప్రకటించి 2014 నుంచి 16 వరకు ప్రకటించిన అవార్డులతో పాటు, 2017, 2018 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను కూడా ప్రకటిస్తే బాగుటుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: