క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ. అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలో సమకూర్చి క్యాన్సర్ చికిత్సను పేదలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఆసుపత్రిలో త్రీడీ డిజిటల్ మామ్మోగ్రఫీ అత్యాధునిక పరికరాన్ని ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ ప్రారంభించారు. 


ఈ కార్యక్రమంలో ఆస్పత్రిలో ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆసుపత్రి వైద్యుడు బాలకృష్ణ అల్లుడు భరత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ  ముఖ్యంగా  క్యాన్సర్ గురించి అవగాహన కలిగేలా కావలసిన కార్యక్రమాలన్నీ కూడ మన ఆసుపత్రి చేపడుతుంది అని అన్నారు.


మారుమూల గ్రామాల్లోకి కూడా దగ్గరున్న డాక్టర్స్ ను పంపి మొబైల్ క్లినిక్ ద్వారా మామ్మోగ్రఫీని అందజేస్తున్నామని,మొబైల్ క్లినిక్ లో అన్ని రకాల వసతులు ఉన్నాయని,అదేవిధంగా మొబైల్ క్లినిక్ ని ఇంకా డవలప్ చేస్తున్నామని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: