తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రధారి అయిన వంగవీటి రంగా భార్య రత్నకుమారి లుక్ కూడా రిలీజైంది. రత్నకుమారి (రంగా భార్య) పాత్రలో తమిళనటి ధృవతార నటన అద్భుతమని ఆమె హావభావాలు అమోఘమని దర్శక నిర్మాతలు చెప్పారు. తాజాగా రివీల్ చేసిన ఫోటోలో రంగాతో సతీమణి రత్నకుమారి అన్యోన్యతను ఎలివేట్ చేశారు. బెజవాడ రాజకీయాల్లో ఎదురేలేని నాయకుడిగా పేరున్న రంగాకు నిరంతరం ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవి. అలాంటి సమయంలో ఎంతో ధైర్యంగా అన్నిటినీ ఎదుర్కొన్న గొప్ప భార్యగా రత్నకుమారి గురించి చరిత్ర చెబుతోంది.
ఆసక్తికరంగా రంగా కాపునేతగా పేరు బడినా తన ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన రత్నకుమారిని పెళ్లాడి కులం అడ్డుగోడ కాదని నిరూపించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వంగవీటి అందరివాడయ్యారు. అందుకే చరిత్రలోనూ నిలిచారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మెజారిటీ పార్ట్ పూర్తయింది. మరో రెండు షెడ్యూల్స్‌తో ఈ చిత్రం పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు.