ఏదైనా సరే సరైన ప్రచారం పొందాలంటే సోషల్ మీడియా ఒక్కటే మార్గం.  సోషల్ మీడియాలో కరెక్ట్ గా ప్రచారం చేసుకుంటే చాలు. అదే హైలైట్ అవుతుంది.  సినిమా కావొచ్చు.. ప్రోడక్ట్ కావొచ్చు.. సోషల్ మెసేజ్ కావొచ్చు.  అందుకే సోషల్ మెసేజ్ ల కోసం ప్రత్యేకంగా ట్యాగ్ క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తుంటారు.  ఇలా చేసే ప్రమోట్ లు బాగా ఉపయోగపడుతుంటాయి.  


ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్, ఫిట్నెస్ ఛాలెంజ్ ఇలా ఎన్నో ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరిని కదిలించాయి.  ఇప్పుడు బాటిల్ క్యాప్ ఓపెన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్నది.  ప్రతి ఒక్కరు కాలితో కిక్ ఇస్తూ బాటిల్ క్యాప్ ను ఓపెన్ చేస్తున్నారు.  ఇది చూసినంత ఈజీ కాదు.  సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరు ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు.  


సల్మాన్ కూడా బాటిల్ క్యాప్ ఓపెన్ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు.  దీన్ని కేవలం వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి మాత్రమే కాకుండా దీని ద్వారా ఓ మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాడు.  దానికి తగ్గట్టుగా బాటిల్ క్యాప్ ను కాలితో కాకుండా నోటితో గట్టిగా ఊది ఓపెన్ చేశారు. 

బాటిల్ నీళ్లు తాగుతూ నీటిని వృధా చేయకండి.. నీళ్లను కాపాడుకుందాం అనే మెసేజ్ ను ఇచ్చారు.  ఈ మెసేజ్ సెగ సోషల్ మీడియాను బాగా తాకింది.  చెప్తే ఆ ఏంటిలే వినేది అనుకుంటారు.  కానీ, ఒక టాప్ సెలెబ్రిటీ చెప్తే మాత్రం దానిని అందరు ఫాలో కావడానికి ట్రై చేస్తారు.  సల్మాన్ చెప్పాడు కాబట్టి నీటిని వృధా చేయడం ఆపేద్దాం.  గ్రౌండ్ వాటర్ ను ఎలా ఇంక్రీజ్ చేయాలో ఆలోచిద్దాం.  గ్రౌండ్ వాటర్ ను ఇంక్రీజ్ చేసే ఛాలెంజ్ ఏదైనా వస్తే తప్పకుండా ఈ ఛాలెంజ్ కు మంచి పేరు వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: