నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ సినిమా ఓ బేబీ లో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సినిమా ధియేటర్ లో రన్ అవుతున్న క్రమంలో సమంత నటించిన నటనకు సమంత అభిమానులు సోషల్ మీడియాలో సమంత పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కలెక్షన్ల పరంగా ఓ బేబీ సినిమాకి వస్తున్న ఆదరణ వింటున్న సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.


ముఖ్యంగా అమెరికాలో ఓ బేబీ ఇప్పటివరకు 800కు పైగా డాలర్లు కలెక్షన్లు సాధించినట్లు...సమంత రికార్డులు సృష్టిస్తున్నట్లు టాలీవుడ్ ట్రేడ్ పండితులు కామెంట్ చేస్తున్నారు. భర్త నాగచైతన్య రికార్డులను కూడా సమంత ఈ సినిమాతో అధిగమించినట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఓ బేబీ సినిమాతో సమంత నాగచైతన్య రికార్డులు కె ఎసరు పెట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి.


విషయంలోకి వెళితే నాగచైతన్య కెరీర్ లో సోలో గా అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం 'మజిలీ'($799 K).  ఇప్పుడు 'ఓ బేబీ' దానిని అధిగమించింది. తిరకాసు ఏమిటంటే 'మజిలీ' సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా సమంత నే నటించడం. మొత్తంమీద ఓవర్సిస్ పరంగా భర్త నాగచైతన్యని అధిగమించేసింది భార్య సమంత. 



మరింత సమాచారం తెలుసుకోండి: