కుర్ర కుమారికి అందం ఎక్కువగానే ఉంది. నటన కూడా ఓకే. ఇచ్చిన పాత్రను వెండితెర మీద బాగానే పండిస్తుందని పేరు తెచ్చుకుంది. అప్పట్లో కొత్తందం అంటూ కేక పెట్టించింది. వెంట పడిన వారు వెర్రెత్తిపోయారు. లిప్ లాకులు, కైపులతో కసెక్కించేసిన ఈ కుమారానికి  తరువాత రోజుల్లో చాన్సులు మాత్రం లేకుండా పోయాయి. చేసిన సినిమాలు వరసగా దెబ్బ తినడంతో సైడ్ లైన్లోకి వెళ్ళిపోవాల్సివచ్చింది.


ఇపుడు మళ్ళీ చాన్నాళ్ళకు ముఖానికి రంగేసుకుంటోంది ఎఫ్ టూ కుమారి హెబ్బా పటేల్. అబ్బా అనిపించే అందాలతో మళ్ళీ నేను రెడీ అంటోంది. నితిన్ భీష్మ మూవీలో సెకండ్ హీరోయిన్ గా  లేటెస్ట్ గా ఆఫర్ వచ్చింది. ఈ మూవీలో మైన్ లీడ్ రోల్ రష్మిక చేస్తోంది. సరే సెకండ్ రోల్ అయినా వచ్చిందే చాన్స్ అనుకుంటూ ముఖానికి రంగేసుకుంటోంది హెబ్బా.


ఇదిలా ఉండగా కుమారి ఎఫ్ 2 తో కేక పుట్టించిన ఈ అమ్మడు తరువాత 23 కిసెస్ అంటూ సెన్సెషన్ క్రియేట్ చేసింది. మధ్యలో మిస్టర్ మూవీని మెగా హీరో వరుణ్ తేజ్ తో చేసింది. ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ నిఖిల్ తో చేసిన మూవీ కూడా ఓకే అనిపించుకుంది. మళ్ళీ గ్యాప్ తరువాత మేక్ప వేసుకుంటున్న ఈ హెబ్బా మతి పోగొడుతుందా అని కుర్రకారు వైట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: